టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా మంచి లాభాలు అందుకుంటున్న వారిలో దిల్ రాజు టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. ఎలాంటి సినిమా వచ్చినా కూడా దిల్ రాజు ఆ సినిమాకు సంబంధించి ఏదో ఒక డీల్ విషయంలో అయితే చర్చలు జరపకుండా ఉండడు.
అయితే దిల్ రాజు మాత్రం పక్క ప్రొఫెషనల్ గానే ఆలోచిస్తూ ఉంటారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలో వస్తే వాటికి థియేటర్ల సంఖ్యను పెంచి ప్రాఫిట్ అందుకునే విధంగా ముందుకు సాగుతారు. ఇక ప్రత్యేకంగా ఆయన డిస్ట్రిబ్యూషన్ లో ఎక్కువ స్థాయిలోనే ప్రాఫిట్స్ అందుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దసరాకు రెండు సినిమాలు ఒకేసారి రాబోతుండగా ఆ రెండు సినిమాల నైజాం హక్కులు ఆయన సొంతం చేసుకోవడం విశేషం.
విజయ్ లియో సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలు దసరా టైంలో విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే నైజాం ఏరియాలకు సంబంధించిన థియేట్రికల్ హక్కులను దిల్ రాజు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
రీసెంట్ గా వచ్చిన జైలర్ సినిమా తెలుగు రైట్స్ మొత్తం కూడా దిల్ రాజు కొనుగోలు చేశారు. దాదాపు 12 కోట్లు పెట్టుబడి పెట్టి ఆ సినిమాను తెలుగులో విడుదల చేసుకోగా ఇప్పటికే పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చింది. అంతే కాకుండా 15 కోట్లకు పైగా ప్రాఫిట్ తో వెళుతోంది. ఈ వీకెండ్ కూడా సినిమాకు మరిన్ని లాభాలు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. మరి రాబోయే రోజుల్లో దిల్ రాజు బాలయ్య విజయ్ సినిమాలతో ఎలాంటి ప్రాఫిట్స్ అందుకుంటాడో చూడాలి.