మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలో బాక్సాఫీస్ సక్సెస్ గా నిలిచినటువంటి వేదళం సినిమాకు ఇది ఇది రీమేక్ వస్తోంది. ఇక దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో అయితే అంచనాలు పెరగలేదు.
అలాగే విడుదలైన సాంగ్స్ టీజర్ ట్రైలర్ కూడా యూట్యూబ్లో అయితే మ్యాజిక్ ఫిగర్స్ ఏమీ అందుకోలేకపోయాయి. ఇక కేవలం కంటెంట్ మీదనే ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది. మెగాస్టార్ చిరంజీవి మార్కెట్ పరంగా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ఎలాగు అందుకుంటాడు. కానీ సినిమాకు తప్పని పరిస్థితుల్లో పాజిటివ్ టాక్ వస్తేనే పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది.
ఇక ఈ సినిమా బిజినెస్ వివరాలలోకి వెళితే సీడెడ్ లో దాదాపు 13 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన భోళా సినిమా ఆంధ్ర ఏరియా మొత్తంలో కూడా 37 కోట్ల రేంజ్ లో ధర పాలికినట్లు సమాచారం. ఇక నైజంలో 25 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.
రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ బిజినెస్ కలుపుకొని 15 కోట్లు కాగా మొత్తంగా భోళా శంకర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రేంజ్ లో థియేట్రికల్ గా బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే 100 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే అందుకోవాల్సింది. మరి ఆ స్థాయిలో మెగాస్టార్ ఈసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి.