సురేందర్ రెడ్డి డబుల్ ధమాకా.!

రామ్ తాళ్లూరి దర్శకత్వంలో సురేందర్ రెడ్డి ఓ సినిమా చేయాల్సి వుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో హీరోగా నటించాల్సి వుంది. కానీ, పవన్‌తో సినిమా అంటే అందుకు ఇంకాస్త టైమ్ పట్టే అవకాశముంది.

ఈ లోపు రామ్ చరణ్ లైన్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్‌, సురేందర్ రెడ్డి మంచి స్నేహితులు. ఆ స్నేహంతోనే ‘ధృవ’ సినిమా చేశాడు. ఆ వెంటనే ‘సైరా నరసింహారెడ్డి’ ఛాన్స్ ఇచ్చాడు రామ్ చరణ్.

తాజాగా సురేందర్ రెడ్డి, రామ్ చరణ్‌కి ఓ కథ చెప్పాడట. సురేందర్ రెడ్డి అంటేనే స్టైలిష్ డైరెక్టర్. ఎందుకో తెలీదు కానీ, ‘ఏజెంట్’ విషయంలో సురేందర్ రెడ్డి దారుణంగా ఫెయిలయ్యాడు.

అలా అని సురేందర్ రెడ్డి టాలెంట్‌ని తక్కువ చేయలేం. సురేందర్ రెడ్డి టాలెంట్ ఏంటో రామ్ చరణ్‌కి తెలుసు కాబట్టే, ‘ఏజెంట్’ రూపంలో డిజాస్టర్ వున్నప్పటికీ రామ్ చరణ్ తనతో సినిమాకి ఛాన్సిచ్చాడు.

అంతేకాదు, వీలైనంత తక్కువ టైమ్‌లోనే సినిమా చేయగలడన్న నమ్మకం కూడా వుంది సురేందర్ రెడ్డి మీద. ఆ నమ్మకంతోనే సూరి చెప్పిన కథకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట రామ్ చరణ్.

అయితే, ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే, డేట్స్ ఏమాత్రం అడ్జస్ట్ అయినా సురేందర్ రెడ్డితో సినిమాని పట్టాలెక్కించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయ్.