‘ఎవరు’ ఆ ఏరియాలో రికార్డ్ కలెక్షన్స్

‘ఎవరు’  కలెక్షన్స్ అక్కడ కుమ్మేస్తున్నాయి

తన దైన శైలిలో సినిమాలు చేస్తూ ..అడవి శేష్..ఇండస్ట్రీలో, ప్రేక్షకులలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా కథకుడిగా, స్రీన్ ప్లే రైటర్‌గా అసమాన ప్రతిభ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. అందుకు ఆయన నటించిన కథ, కథనాలు అందించిన ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాల సక్సెస్ లే సాక్ష్యం. తాజాగా ఈ యంగ్ హీరో లీడ్ రోల్‌లో నటించిన మూవీ ‘ఎవరు’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆగస్టు 15న విడుదలై మంచి హిట్ ని అందుకుంది ఈ చిత్రం.

అడివి శేషు,రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఎవరు చిత్రం బాక్సాఫీస్ వద్ద పోటీ లేని విధంగా భాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉంది. స్థిరమైన వసూళ్లు కలెక్ట్ చేస్తూ ముందుకెళుతోంది. ఎవరు విడుదలై రెండు వారాలవుతున్నా వసూళ్లు నిలకడగా సాగడం ఆ టీమ్ ని ఆనందంలో ముంచేస్తోంది. ముఖ్యంగా ఏ సెంటర్స్ మరియు మల్టీ ప్లెక్స్ లలో ఎవరు స్ట్రాంగ్ గా ఉంది.

గత సినిమాల ప్రభావంతో మంచి ఓపెనింగ్స్ అందుకున్న శేష్.. ‘ఎవరు’తో కెరియర్ హయ్యెస్ట్ వసూళ్లను రాబట్టారు. మరీ ముఖ్యంగా నైజాంలో లో కూడా ఎవరు చిత్రం అంచలనాలకు మించిన వసూళ్లు రాబడుతుంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఎవరు నైజాంలో 2.80 కోట్ల షేర్ సాధించినట్లు సమాచారం. ఈ వారం చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు విడుదల లేకపోవడం ఈ మూవీకి కలిసొచ్చే అంశం. దీనితో మరో వారం వరకు కూడా ఎవరు మూవీ మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎవరు 9 కోట్ల షేర్ రాబట్టిందీ చిత్రం.

పివిపి పతాకంపై పరం వి పొట్లూరి, పెర్ల్ వి పొట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని వెంకట్ రాంజీ తెరకెక్కించగా, శ్రీచరణ్ పాకల సంగీతం అందించారు. అడివి శేషు తో పాటు, రెజీనా కాసాండ్రా, నవీన్ చంద్ర, మురళి శర్మ ముఖ్య పాత్రలలో నటించడం జరిగింది.