వరుసగా బాలీవుడ్ ని మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం మర్చిపోక ముందే వెటరన్ స్టార్ రిషీ కపూర్ మరణంతో బాలీవుడ్ సహా అన్ని సినీ పరిశ్రమలు మూగబోయాయి. ఒకరోజు గ్యాప్ లోనే బాలీవుడ్ ఇద్దరు స్టార్లను కోల్పోవడంతో అక్కడి వాతావరణం అంతా విషాధంగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ జ్ఞాపకాల నుంచి బాలీవుడ్ తేరకుంటోంది. తాజాగా మరో బాలీవుడ్ యువ నటుడు మోహిత్ బఘేల్ కన్ను మూయడంతో మరోసారి బాలీవుడ్ శోకసంద్రమైంది. ఆరు నెలలుగా క్యాన్సర్ తో బాధపడుతోన్న మోహిత్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కాగా ఆరోగ్యం విషమించంతో ఇంటికి తరలించిన నేపథ్యంలో మోహిత్ ఆదివారం ఉదయం ఇంట్లోనే కన్ను మూసాడు. మోహిత్ స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో మరణించినట్టు రచయిత, దర్శకుడు రాజ్ శాండిల్య మీడియాకు వెల్లడించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో రెడీలో మోహిత్ నటించాడు. 26 ఏళ్ల చిన్న వయసులో అతడు మరణించడం సాటి తారల్లో విషాదం నింపింది. మెహిత్ కామెడీ సర్కస్-జబారియి జోడి, డ్రీమ్ గర్ల్ వంటి చిత్రాల్లో నటించాడు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన రెడీలోనూ నటించాడు. మోహిత్ బాగాల్ జూన్ 7 1993 లో యూపీలో జన్మించాడు. చోట్ మియాన్ అనే కామెడీ షోతో కెరీర్ ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్నాడు. అవకాశాలు బాగానే వస్తున్నాయి. కానీ ఇంతలోనే మృత్యువు కబళించింది. మోహిత్ మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.