వోగ్ అవార్డ్స్ 2019 రెడ్ కార్పెట్‌పై త‌ళుకుబెళుకులు

ప్ర‌తిష్ఠాత్మ‌క వోగ్ బ్యూటీ అవార్డ్స్ వేడుక‌లు దిల్లీలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో ప‌లువురు బాలీవుడ్ భామ‌లు త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శించారు. ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియాభ‌ట్, ర‌కుల్ ప్రీత్ సింగ్, భూమి ఫెడ్నేక‌ర్, సారా అలీ ఖాన్,  శ్ర‌ద్ధా క‌పూర్ త‌దిత‌ర భామ‌లు రెడ్ కార్పెట్ పై అద‌ర‌గొట్టారు. ఈ వేడుక‌ల్లో ర‌కుల్ రెడ్ క‌ల‌ర్ డిజైన‌ర్ డ్రెస్ లో త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శించింది.

ఇక ఇదే వేడుక‌లో శిల్పా శెట్టి, ష‌మితా శెట్టి, ష‌ర్మిలా ఠాగూర్, షాహిద్ క‌పూర్, విక్కీ కౌశ‌ల్ వంటి స్టార్లు రెడ్ కార్పెట్ పై న‌డ‌క‌ల‌తో అద‌ర‌గొట్టారు. మ‌లైకా అరోరాఖాన్ , సోనాలి బింద్రే ఈ వేడుక‌లో త‌మ‌దైన విన్యాసాల‌తో మైమ‌రిపించారు. వోగ్ ఉత్త‌మ అంద‌గ‌త్తెగా ఆలియాభ‌ట్ ఎంపిక‌వ్వ‌గా.. వోగ్ ఉత్త‌మ డెబ్యూ బ్యూటీగా సారా అలీఖాన్ మెరిసిపోయింది. వోగ్ మ్యాగ‌జైన్ ప‌దో ఎడిషన్ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఈ పుర‌స్కారాల్ని అందించారు.