పొట్టిగా ఉన్నోళ్లకి ఆ ఛాన్స్ లేదంటున్న జాన్వీ!

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. తాజాగా జూనియర్ “ఎన్టీఆర్ – 30” లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా చేస్తుండటంతో తెలుగు సినీజనాలు ఆమె అప్ డేట్స్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజాగా తనకు కాబోయే వాడికి ఉండాల్సిన అర్హతలపై ఆసక్తికరంగా స్పందించింది జాన్వీ!

తాజాగా తన వ్యక్తిగత జీవితం, తనకున్న ఇంట్రస్టులతో పాటు తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి అనే అంశాలపై జాన్వీ కపూర్ స్పందించింది. గత కొంత కాలంగా… గ్లామర్ గేట్లు మాగ్జిమం ఎత్తేసిన జాన్వీ.. తన అందాలతో యువతలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

ఆ సంగతులు అలా ఉంటే… నటిని కాకపోయుంటే కచ్చితంగా ప్రపంచాన్ని చుట్టేస్తూ… కొత్త వ్యక్తుల్ని కలుసుకుంటూ… రచయిత్రిని అయ్యేదాన్నని చెబుతున్న జాన్వీకి.. కాలుష్యం కనిపించని, హారన్స్ వినిపించని ప్రదేశాలంటే ఇష్టమంట. ఈ సందర్భంగా తనకు కాబోయే వాడిపై స్పందించిన ఆమె… “నా వృత్తిని గౌరవించే వ్యక్తి నా జీవితంలోకి రావాలనుకుంటున్నా. అతనికి సెన్సాఫ్‌ హ్యూమర్‌ బాగా ఉండాలి. తెలియని విషయాలు నేర్చుకుంటూ.. నాకూ ఏదో ఒకటి ఉత్సాహంగా నేర్పించాలి. నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి” అని చెప్పుకొచ్చింది.

అంతవరకూ బాగానే ఉంది కానీ.. మరో కండిషన్ గురించి చెబుతూ కొంతమంది కి షాకిచ్చింది జాన్వీ కపూర్. అవును… “నన్ను చేసుకోబోయే వాడు.. మా నాన్న కంటే ఎక్కువ ఎత్తు ఉండాలి” అని షాకిచ్చింది జాన్వీ! దీంతో… కాస్త పొట్టిగా ఉండే అబ్బాయిలు తెగ ఫీలవుతున్నారంట. అయినా.. ఈ విషయంలో హైట్ ను కండిషన్ గా పెట్టడం ఏమిటి? పొట్టిగా పుట్టడం మా తప్పా? అంటూ తెగ ఫీలయిపోతున్నారట ఈ బ్యూటీ ఫ్యాన్స్!

అయితే… అలాంటి ఆశాజీవులకు నిరాశ కలిగించకుండా ఉండే మాట ఇప్పుడు చెప్పబోతున్నాం… అదేమిటంటే… జాన్వీ క‌పూర్.. (ప్రస్తుత) బాయ్‌ ఫ్రెండ్‌ గా చెబుతున్న శిఖ‌ర్ ప‌హ‌రియా హైట్ 5.7 మాత్రమే! అంటే… ఛాన్స్ ఉంది! మరో విషయం ఏమిటంటే… బోనీ కపూర్ హైట్5.8 కంటే… శిఖ‌ర్ ప‌హ‌రియా హైట్ తక్కువే. సో… జాన్వీ ఏదో చెప్పింది కానీ… పొట్టిగా ఉన్నా ప్రయత్నాలు ఆపాల్సిన పనిలేదు!