టీజర్ టాక్ : నిజంగానే షాకిచ్చిన “ఆదిపురుష్ 3D” టీజర్..కానీ మరీ ఇంత తేడానా?

ఇప్పుడు బాలీవుడ్ అలాగే టాలీవుడ్ సినిమా దగ్గర కూడా మంచి హాట్ టాపిక్ గా నిలిచిన భారీ చిత్రం “ఆదిపురుష్”. దర్శకుడు ఓంరౌత్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన ఈ చిత్రం ఒక ఎపిక్ విజువల్ ట్రీట్ లా తెరకెక్కింది.

సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన నాటి నుంచి ఒక్క విజువల్ కూడా బయటకి పొక్కకుండా చేసిన మేకర్స్ ఇప్పుడు ఫైనల్ గా గ్రాండ్ టీజర్ ని అయితే రిలీజ్ చేశారు. అయితే ఇది చూసిన అభిమానులు అయితే బాగా డిజప్పాయింట్ అయ్యిపోయారు.

500 కోట్లు అని చెప్పి కార్టూన్స్ లెవెల్ గ్రాఫిక్స్ చేసారు అంటూ బాగా మండిపడ్డారు. కానీ మేకర్స్ ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై చూస్తేనే తెలుస్తుంది అని ఇప్పుడు స్పెషల్ స్క్రీనింగ్ లు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ చెయ్యగా వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే కంటెంట్ పరంగా మాత్రం నిజంగానే 3D లో ఈ టీజర్ షాకిచ్చేలా ఉంది. విజువల్స్ ఈ వెర్షన్ లో చాలా నాచురల్ గా కనిపిస్తున్నాయి. అప్పుడు కార్టూన్ లా కనిపించిన యానిమేషన్ పాత్రలు అన్నీ కూడా నిజంగానే చాలా సహజంగా కనిపించడం విశేషం.

డెఫినెట్ గా 3D వెర్షన్ కి నార్మల్ వెర్షన్ కి అయితే చాలా తేడా కనిపిస్తుంది. మరి రెండిటికి ఇంత తేడా ఏంటి అనేది చాలా సస్పెన్స్ గా మారింది. మేజర్ గా ఇండియాలో కానీ తెలుగులో కానీ నాన్ 3D స్క్రీన్స్ ఎక్కువ మరి మామూలు వెర్షన్ పరిస్థితి ఏంటి అనేది ఆసక్తిగా మారింది. 3D వెర్షన్ లో మాత్రం ఆదిపురుష్ టీజర్ అనుకున్న అంచనాలు రీచ్ అయ్యింది.