Vikrant Rona review : రివ్యూ : విక్రాంత్ రోణా – బోరింగ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా !

Vikrant Rona

 

రివ్యూ : విక్రాంత్ రోణా – బోరింగ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా !

 

నటీనటులు: కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రవిశంకర్ గౌడ్

 

దర్శకుడు: అనూప్ భండారి

నిర్మాతలు: షాలిని జాక్ మంజు, అలంకార్ పాండియన్

సంగీత దర్శకుడు: బి అజనీష్ లోక్‌నాథ్

సినిమాటోగ్రఫీ: విలియం డేవిడ్

ఎడిటర్: ఆశిక్ కుసుగొల్లి

అనుప్ భండారి ద‌ర్శ‌క‌త్వంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా వచ్చిన సినిమా ‘విక్రాంత్ రోణా’. ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యింది. మరి, ఈ సినిమా మెప్పించిందా?, లేదా ?. రివ్యూ చూద్దాం రండి.

 

కథ :

కోమరట్టు అనే గ్రామంలో మొదలైన పీరియాడిక్ కథ ఇది. కోమరట్టు గ్రామంలో ఒకే స్కూల్ లో చదువుకున్న వారి పిల్లలు వరుసగా చనిపోతూ ఉంటారు. ఆ పిల్లల హత్యల పై విచారణ చేస్తున్న ఆ ఊరు ఇన్ స్పెక్టర్ చనిపోతాడు. అతని ప్లేస్ లోకి కొత్త ఇన్ స్పెక్టర్ విక్రాంత్ రోణా (కిచ్చా సుదీప్ ) వస్తాడు. విక్రాంత్ రోణా ఈ గ్రామానికి రావడానికి కారణం ఏమిటి?, చివరకు పిల్లలను చంపుతున్న వ్యక్తిని విక్రాంత్ రోణా పట్టుకున్నాడా ? లేదా ?, ఆ చనిపోయిన పిల్లల్లో విక్రాంత్ రోణా సంబంధించి ఎవరైనా ఉన్నారా ? లేదా ? అనేది మెయిన్ కథ.

 

Vikrant Rona
Vikrant Rona review poster

 

విశ్లేషణ :

ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన విక్రాంత్ రోణా పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా విక్రాంత్ రోణాగా కిచ్చా సుదీప్ నటన చాలా బాగుంది. తన పాత్రకు తాలూకు పెయిన్.. అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ అండ్ ఎమోషన్ వంటి అంశాలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Vikrant Rona Telugu movie review

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నీతా అశోక్ తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అయితే ఆమెలో హీరోయిన్ మెటీరియల్ లేదు. దాంతో హీరోయిన్ కంటే.. ఐటమ్ సాంగ్ చేసిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నే ఎక్కువ ప్రభావం చూపించింది. మరో కీలక పాత్రలో నటించిన రవిశంకర్ గౌడ్, తన పాత్రతో మెప్పించాడు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

అయితే, ఇలాంటి సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లింగ్ డ్రామాలో స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. కానీ విక్రాంత్ రోణాలో అది మిస్ అయ్యింది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సాగాల్సిన కథనం.. ఏ మాత్రం ఆసక్తి లేకుండా చాలా స్లోగా సాగింది. నిజానికి కొన్ని చోట్ల సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నా ఇంట్రస్ట్ గా సాగలేదు.

 

ప్లస్ పాయింట్స్ :

సుదీప్ నటన,

ఎమోషనల్ గా సాగే ఫ్యామిలీ స్టోరీ

సాంగ్స్

గ్రాండ్ విజువల్స్

 

మైనస్ పాయింట్స్ :

కథాకథనాలు,

స్క్రీన్ ప్లే బోర్ గా సాగడం,

అక్కడక్కడా స్లోగా నడిచే సన్నివేశాలు,

కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవ్వడం.

రెగ్యులర్ డ్రామా ఎక్కువ అవ్వడం.

 

Vikrant Rona
Vikrant Rona

తీర్పు :

పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ థీమ్ తో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు అండ్ విజువల్స్ బాగున్నాయి. కానీ, సినిమా మాత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. సినిమాలో పేలవంగా సాగే స్క్రీన్ ప్లే, బోరింగ్ సీన్స్ ప్రేక్షకుడికి సినిమా పై కలిగే ఆసక్తిని నీరుగారుస్తాయి. కానీ విక్రాంత్ రోణాగా సుదీప్ నటన అద్భుతంగా ఉంది. సుదీప్ ఫ్యాన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.

 

రేటింగ్ : 2.5 / 5

 

Vikrant Rona