నూతన సంవత్సర వేళ హిందీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతోన్న బాలీవుడ్ ప్రముఖ నటుడు ఖాదర్ ఖాన్ కెనడా లోని తన స్వగృహంలో తెల్లవారు ఝామున నాలుగు గంటలకు కన్నుమూసారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు సర్ఫరాజ్ ఖాన్ అధికారికంగా వెల్లడించారు.
81 సంవత్సరాల వయసు కలిగిన ఈ నటుడు ప్రస్తతం కెనడాలోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఉండటంతో.. వెంటిలేటర్ పై శ్వాసను అందిస్తున్నారు. రికవరీ అవుతున్నారు అనుకున్న మూమెంట్ లో మృతి చెందారు.
కెరీర్ పరంగా … ఇక 1973లో రాజేష్ ఖన్నా హీరోగా తెరకెక్కిన ‘డాగ్’ మూవీతో నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఖాదర్ ఖాన్..ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఒకవైపు నటిస్తూనే చాలా సినిమాలకు కథా సహకారంతో పాటు మాటలు అందించారు. హిట్ సినిమాల్లో నటించారు. ముఖ్యంగా అమితాబ్ నటించిన చాలా సినిమాలకు ఆయన రచనా సహకారం అందించారు.
తనదైన నటనతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేసిన ఖాదర్ ఖాన్..22 అక్టోబర్ 1937లో అఫ్ఘనిస్థాన్‌లో జన్మించారు. ముందు కథా రచయితగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఖాన్..ఆ తర్వాత 1971లో తెరకెక్కిన ‘ఫజ్ర్ అల్ ఇస్లామ్’లో వాయిస్ ఓవర్ అందించారు.