చంపేస్తామంటూ ప్రముఖ గాయకుడికి బెదిరింపులు
ప్రముఖ సినీ గాయకుడు ఉదిత్ నారాయణ్‌ను చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారు. గత నెల రోజులుగా ఆయనకు ఇలాంటి పోన్ కాల్స్ వస్తున్నాయి. దాంతో ఆయన ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంబోలి పోలీసులు ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్‌కు చెందిన యాంటీ ఎక్స్‌టోర్షన్ సెల్(ఏఈసి)కి బదిలీ చేశారు. కేసును విచారించిన పోలీసులు ఈ ఫోన్ కాల్స్ దొంగిలించబడిన ఫోన్ నుంచి వస్తున్నట్లు, ఫోన్ చేస్తున్న వ్యక్తిని లక్ష్మణ్‌గా గుర్తించారు.
అంబోలి పోలీస్ట్ స్టేషన్‌కు చెందిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ భరత్ గౌక్వాడ్ మాట్లాడుతూ… ‘నాలుగు రోజుల క్రితం ఉదిత్ నారాయణ్ ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆయన ఉండే ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచాం.’ అని తెలిపారు.పోలీసుల విచారణలో ఫోన్ నెంబర్ ఉదిత్ నారాయణ నివాసం ఉంటున్న బిల్డింగ్ సెక్యూరిటీ గార్డు మీద రిజిస్టర్ చేయబడి ఉందని తేలింది. వాచ్‌మెన్‌ను ఎంక్వైరీ చేయగా… తన ఫోన్ నెల రోజుల క్రితం సొంతూరికి వెళ్లి వస్తుండగా ఎవరో దొంగిలించారని తెలిపారు.
ఉదిత్ నారాయణ్ ,…అమ్మాయే సన్నగా …(ఖుషీ), నాతో వస్తావా ..(మాస్), ఎగిరే చిలకమ్మ …(బంగారం), జాంపండువే…(వసంతం),ఎలా వచ్చనమ్మ …(సంక్రాంతి), ఆడువారి మాటలుకు అర్దాలే వేరులే(ఏమైందో ఈ వేళ..),ఆది (పట్టు ఒకటో సారి..),ఆట(ముధ్దులాట..ముధ్దులాట),రంగా రెడ్డి జిల్లాలోకి(ఆయుధం) వంటి అనేక తెలుగు సినిమాల్లో మంచి పాటలు పాడి అభిమానులను ఉర్రూతలూగించారు.