అతని ప్రెవేట్ పార్ట్ లను ప్రెస్ చేసిన తాప్సీ, వివాదం?

అతని ప్రెవేట్ పార్ట్ లను ప్రెస్ చేసిన తాప్సీ, వివాదం?

వివాదాలను తన వైపు లాక్కోవటంతో తాప్సీ ఎప్పుడూ ముందు ఉంటుంది. మానవత్వం, స్త్రీ పురుష సమానత్వం వంటి విషయాలపై నిరంతరం ఆమె సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఉంటుంది. ఏం చేయచ్చు..ఏం చేయకూడదునే విషయాలు చెప్తూంటుంది. అయితే అంత పేరు తెచ్చుకున్న ఆమె తాజాగా రిలీజైన మిషన్ మంగళ్ ట్రైలర్ లో కథ ప్రకారమే అయినా చేసిన ఓ పని ఆమెను సోషల్ మీడియా జనం తిట్టిపోసేలా చేస్తోంది.

ఓ వ్యక్తి ప్రెవేట్ పార్ట్ లను ఆమె ప్రెస్ చేస్తోంది. డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఆమె గేర్ వేయటానికి ప్రయత్నం చేసి ప్రక్కన కూర్చున్న వ్యక్తి ప్రెవేట్ పార్ట్ లను పుష్ చేస్తుంది. దాంతో అతను గట్టిగా బాధతో అరుస్తాడు. ఫన్ కోసం చేసారో లేక కథ ప్రకారమే చేసారో కానీ జనాలకు అన్ని విషయాల్లో నీతులు చెప్పే తాప్సీ ఇలాంటివి చేయకూడదు అంటున్నారు. అదే ఓ స్త్రీకు ఎవరైనా చేసినట్లు కథలో భాగమే అని చూపినా తాప్సీ ఈ పాటికి రచ్చ రచ్చ చేసేదని విమర్సిస్తున్నారు.

https://twitter.com/maneeshfilmdir/status/1159466793401909248

బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’. ఇదొక సైన్స్ ఫిక్షన్ డ్రామా.. మిషన్ మంగళ్.. 2013లో భారత్ చేపట్టిన మంగళయాన్ మిషన్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్, వీడియో సాంగ్‌కి చక్కటి ఆదరణ లభించింది. తెలుగు ట్రైలర్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

రీసెంట్‌గా మిషన్ మంగళ్ న్యూ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇస్రో చేపట్టే మిషన్ నేపథ్యంలో సాగిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అక్షయ్ మరోసారి తన నటనతో ఆకట్టుకోగా.. విద్యా బాలన్, తాప్సీ, నిత్యా మీనన్, షర్మాన్ జోషీ డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించి అలరించారు. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి.