చేసిన చెత్త పనికి హీరోయిన్‌ ని తెగ తిడుతున్నారు

చేసిన చెత్త పనికి హీరోయిన్‌ ని తెగ తిడుతున్నారు

సోషల్ మీడియా రోజుల్లో సెలబ్రెటీలు తమ క్రేజ్ పెంచుకోవటం కోసం రకరకాల మార్గాల్లో ప్రయాణం పెట్టుకుంటూంటారు. జనం కూడా వాటిని ఆస్వాదిస్తూంటారు. అయితే వాళ్లను ప్రక్కదారి పట్టించి, వారి ఎమోషన్స్ తో ఆడుకోవాలని చూస్తే మాత్రం వాళ్లకు కాలుతుంది. తిట్టి పోస్తారు. అవతల ఎవరు ఉన్నారనేది కూడా చూసుకోరు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి పరిస్దితి అదే.

మీకు గుర్తు ఉందో లేదో కానీ.. నన్ను అరెస్టు చేశారు అంటూ బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హా. అస్లీసోనాఅరెస్టెడ్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌తో నిన్నటి నుంచి ఓ వీడియో ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. ‘ మీరు నన్ను ఇలా అరెస్టు చేయకూడదు. అసలు నేనెవరో తెలుసా? నేనే తప్పూ చేయలేదు. ఇలా ఎలా అరెస్టు చేస్తారు’ అంటూ సోనాక్షి నిలదీస్తున్నట్లుగా ఉన్న వీడియోను చూసి ఆమె ఫ్యాన్స్ కంగారుపడిపోయారు.

అయితే ఈ రోజు అదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్‌ అని తెలింది. మైగ్లామ్‌ అనే మేకప్‌ కలెక‌్షన్‌ బ్రాండ్‌ తరఫున సోనాక్షి ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె అరెస్టు అయినట్లుగా ఉన్న వీడియోను డిజైన్ చేసారు. ఈ క్రమంలో తన కొత్త యాడ్‌ విశేషాలను సోనాక్షి సిన్హా సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

‘ అవును నన్ను అరెస్టు చేశారు. ఎందుకో అడగండి?- ఎందుకంటే ఇంత అందంగా కనిపించడం నేరం కాబట్టి.!!! మై గ్లామ్‌ తరఫున ప్రచారం చేస్తున్నానని చెబుతున్నందుకు ఉద్వేగానికి లోనవుతున్నా. దీని ఉత్పత్తులతో మీరు ఎంతో అందంగా కనిపిస్తారు. ఎప్పుడైనా..ఎక్కడైనా’ అని మరోసారి ప్రోడక్ట్‌ను ప్రమోట్‌ చేశారు.

అయితే ఫ్యాన్స్ కు ఇది పబ్లిసిటీ స్టంట్లు అని తెలిసిన దగ్గర నుంచి హమ్మయ్య అనుకున్నా ..ఆ తర్వాత ఇదేం పని , ఎంత కంగారుపడ్డామో అని తిట్టిపోస్తున్నారు. ఇలాంటి పోస్ట్ లు పెడితే చిరాకు వస్తుందని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదైమైనా ఇది పద్దతి కాదు…అని సోనాక్షికు డైరక్ట్ గానే సోషల్ మీడియాలో వార్నింగ్ లు ఇస్తున్నారు.