“ఆదిపురుష్” వరుస అప్డేట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కి భారీ బొనాంజా.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆదిపురుష్” కోసం పాన్ ఇండియా వైడ్ ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ భారీ సినిమా ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ డేట్ కూడా తెచ్చుకుంది.

ఇక మరో పక్క సినిమా ఫస్ట్ లుక్ ఇంకా టీజర్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తెలుస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ పై కొత్త షెడ్యూల్ తెలుస్తుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఈ దసరా మహోత్సవాల్లో అక్టోబర్ 2న సినిమా తాలుకా గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నారట.

మరి ప్రభాస్, సైఫ్ అలీఖాన్, అలాగే దర్శకుడు ఓంరౌత్ హీరోయిన్ కృతి సనన్ కూడా దసరా మహోత్సవాల్లో పాల్గొని ఈ సినిమా గ్లింప్స్ ని రిలీజ్ చేస్తారట. ఇక ప్రభాస్ బర్త్ డే కానుకగా ఓ పోస్టర్ లాంచ్ కూడా ఉందట.

దీనితో పాటుగా నవంబర్ చివరలో ట్రైలర్ లాంచ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇలా భారీ షెడ్యూల్ ని మేకర్స్ ప్లాన్ చేసుకొని ఇప్పుడు సిద్ధంగా ఉన్నారట. దీనితో అయితే ఇక ఈ అక్టోబర్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కి నాన్ స్టాప్ బొనాంజా అని చెప్పి తీరాలి.