షారుక్ మూవీ.. పాన్ ఇండియా ఇండియా అంటున్నారే

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వెండితెరపై కనిపించి దాదాపు మూడేళ్లవుతోంది. చివరగా 2018లో జీరో సినోమాతో వచ్చిన షారుక్ ఆ తరువాత మరో సినిమా చేయలేదు. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ రావడంతో ఆయన సినిమాలకు ఎండ్ కార్డ్ పెట్టె అవకాశం ఉన్నట్లు కూడా రూమర్స్ వచ్చాయి. ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా షారుక్ ఎందుకో ఒప్పుకోలేదు.

ఇక సినిమాలకు ఎండ్ కార్డ్ పెట్టినట్లే అనే రూమర్స్ మరింత ఎక్కువవుతున్న తరుణంలో తమిళ డైరెక్టర్ అట్లీతో రెగ్యులర్ గా టచ్ లో ఉండడం అభిమానుల్లో ఆశలను చిగురించాయి. సంఖి అనే ప్రాజెక్ట్ సెట్టయినట్లు దాదాపు రూమర్స్ కన్ఫర్మ్ అయ్యాయి. అయితే ఆ సినిమా కాస్త ఆలస్యంగా వచ్చినా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు టాక్ వస్తోంది. గతంలో బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమాని తెలుగులో గట్టిగానే రిలీజ్ చేశారు కానీ వర్కౌట్ కాలేదు. ఇక అమీర్ ఖాన్ కూడా థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ తో కూడా బాహుబలి రికార్డులను బద్దలు కొట్టాలని అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు. మరి సంఖి సినిమాతో షారుక్ ఏ రేంజ్ లో హిట్ కొడతాడో చూడాలి.