ట్రైలర్..అద్బుతం అంటున్నారు..మీరు చూసారా?

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘జీరో’. ఈ సినిమాలో షారూఖ్ మరుగుజ్జు పాత్రలో కనిపిస్తూ అంచనాలు పెంచేస్తున్నారు. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ తో అనుష్క శర్మ, కత్రినా కైఫ్ జత కట్టారు. ఈ సినిమాలో షారుక్‌ పేరు బవ్వే సింగ్‌.ఈరోజు షారుక్‌ 53వ పుట్టినరోజును సందర్బంగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరూ టీమ్ ఎఫెర్ట్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

ఇక ఈ ట్రైలర్ లో షారుక్‌ మరుగుజ్జు కావడంతో పెళ్లి చేసుకుందామంటే ఎవ్వరూ పిల్లను ఇవ్వడానికి ముందుకు రారు. దాంతో పెళ్లి చేసుకోవడానికి మ్యారేజ్‌ బ్యూరో చుట్టూ తిరుగుతుంటాడు. ఓ రోజు మ్యారేజ్‌ బ్యూరో యజమాని షారుక్‌ బాధ భరించలేక..‘నాకోసం దిల్లీ నుంచి వచ్చావా..నీలాంటి వాడికోసం ఈ ఆసియా ఖండంలోనే ఏ ఆడపిల్లా పుట్టలేదు’ అని విసుగ్గా అంటాడు.

అప్పుడు షారుక్‌..అనుష్క శర్మ ఫొటోను చూపించి.. ‘అబద్ధం చెప్తున్నావు‌.. నాలాంటి వారు ఈ ప్రపంచంలోనే ఉండరు అన్నావు కదా..’ అంటూ అనుష్కను పెళ్లి చేసుకుంటానంటాడు.

ఆ తర్వాత అనుష్క దివ్యాంగురాలు అని తెలీక ఆమెను కలవడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూస్తే ఆమె సరిగ్గా నిలబడలేక చక్రాల కుర్చీలోనే కూర్చోవడం చూసి ‘ఫొటోలో నాకు చక్రాల కుర్చీ కనిపించలేదే’ అని షారూఖ్ షాకవడం ఫన్నీగా ఉంటుంది.

ఈ చిత్రంలో కత్రినా సూపర్‌స్టార్‌ పాత్రలో, మద్యానికి బానిసైన పాత్రలో కన్పించారు. అలాగే నరాల వీక్‌నెస్‌తో బాధపడుతున్న అమ్మాయి పాత్రలో అనుష్క ఒదిగిపోయారు.

ఫ్యాన్ సినిమా తర్వాత మరో డిఫరెంట్ అండ్ చాలెంజింగ్ రోల్ లో షారుక్ ఖాన్ నటిస్తున్నాడు. షారూఖ్ అభిమానులు ‘జీరో’ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. జీరో సినిమాకు ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహిస్తు్నారు.

గతంలో షారూఖ్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ ‘జ‌బ్ త‌క్ హై జాన్’ సినిమాలో కలిసి న‌టించారు. ఈ చిత్రానికి షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Zero | Official Trailer | Shah Rukh Khan | Aanand L Rai | Anushka | Katrina | 21 Dec 2018