ఒక్కోసారి మనం ప్రిపేర్ అవ్వకపోతే మన మనస్సులో ఉన్న మాటలు యాజటీజ్ బయటకు వచ్చేస్తాయి. అయితే ఆ మాటలు మన గురించి అయితే ఏదో కవర్ చేసుకోవచ్చు..లేదా వాటి ఫలితం అనుభవించటంలో అర్దం ఉంది. అలా కాకుండా మన మాటలు వేరే వారి గురించి అయితే , అవి నిజాలే అయినా ఎంత ఇబ్బంది…ఎంత ఇరకాటం..ఇప్పుడు అదే పరిస్దితి షారూఖ్ ఖాన్ ….థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ టీమ్ కు తీసుకు వచ్చాడు. అనాలోచితంగా అన్న మాట ఇప్పుడు వైరల్ అయ్యింది. అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ షారూఖ్ ఏమన్నారు..
వివరాల్లోకి వెళితే.. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్‌లు కలిసి నటించిన భారీ బడ్జెట్ చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కు ముందు ఓ రేంజిలో హైప్ లో ఉంది. బాహుబలి రికార్డ్ లు సైతం బ్రద్దలు అయిపోతాయని ట్రేడ్ లో వినిపించింది. నార్త్ ఇండియా మీడియా అయితే ఈ సినిమా గురించి అద్బతం అన్నట్లు గా ప్రచారం చేసింది. అయితే సినిమా రిలీజైంది. ఢమాల్ అంది.
అభిమానులను కొంచెం కూడా అలరించలేకపోయింది. కథ,స్క్రీన్ ప్లే తో పాటు టేకింగ్, మేకింగ్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటంతో డిజాస్టర్ టాక్ వచ్చేసింది. అయితే ఆ టీమ్ ..కలెక్షన్స్ చూపుతూ… సినిమా పరువు కాపాడుకునే పనిలో ఉంది. కానీ ఈ విషయంపై స్పందించిన బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ థగ్స్ టీంకు షాక్ ఇచ్చాడు. సినిమా పోయిందని చెప్పేశాడు.
షారూఖ్ మీడియాతో మాట్లాడుతూంటే… అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ నటించిన ఈ చిత్రం ప్రస్తావన వచ్చింది. ఆ వెంటనే సినిమా ఫ్లాప్ కావడం తనకు ఎంతో బాధను కలిగించిందని షారూఖ్ అనేశాడు.
ఇదే సమయంలో అమితాబ్, అమీర్ లు బాలీవుడ్ ఇండస్ట్రీకి సేవ చేస్తున్న వారని, సినిమా పోయినంత మాత్రాన వారి ప్రతిభను తక్కువ చేయలేమని అన్నాడు. గతంలో తన ‘రావన్’ చిత్రానికీ ఇదే పరిస్థితి వచ్చిందని అన్నాడు.
భారత సినీ చరిత్రలో ఇంతవరకూ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ వంటి చిత్రం రాలేదని చెప్పాడు. చిత్ర టీమ్ కు మద్దతుగానే షారూఖ్ మాట్లాడినా, విడుదలై 10 రోజులు కూడా కాకుండానే ఫ్లాప్ అనడం, నిర్మాతలకు మింగుడు పడటం లేదట.