హఠాత్తుగా సల్మాన్ కు ఈ బుద్ది ఎందుకు పుట్టిందో?

హీరోలు ఓ స్దాయికు వచ్చాక తాము సంపాదించిన డబ్బును వ్యాపారాల్లో పెట్టడం మొదలెడుతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీని ఏలే సూపర్ స్టార్స్ అయితే రకరకాల బిజినెస్ లలో తమ డబ్బుని పెడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సొంతంగా ఓ టీవీ ఛానల్‌ స్థాపించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు అనేక బిజినెస్ లు ఉన్నాయి. అయినా సరే ఈ టీవి ఛానెల్ బిజినెస్ లోకి కూడా రావాలని ఆయన భావిస్తున్నారు. తనకున్న సినిమా పరిచయాలతో ఖచ్చితంగా పూర్తి గ్లామర్ ఛానెల్ గా తను మార్చగలననే నమ్మకంతో ఈ ఛానెల్ ని లాంచ్ చేయబోతున్నట్లు బాలీవుడ్‌ సినీ వర్గాలు చెప్తున్నాయి.

ఓవైపు నటుడిగా, నిర్మాతగా క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న సల్మాన్‌.. రీసెంట్ గా టీవీ ప్రొడక్షన్‌ రంగంలోకీ అడుగుపెట్టారు. అయితే తాజాగా ‘ఎస్కె టీవీ’ పేరుతో సొంతంగా ఓ ఛానల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడట సల్లూ భాయ్‌. ఇప్పటికే దీన్ని ప్రారంభించడానికి అవసరమైన లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నారట సల్మాన్‌. కొత్త ఫ్యాషన్‌ లేబుల్, బీయింగ్‌ చిల్డ్రన్, పిల్లల కోసం ప్రత్యేకంగా దీన్ని స్థాపిస్తున్నాడట.

ఇక ఈ టీవి ఛానెల్ లో ప్రసారం చేయడానికి వీలుగా తన పాత సినిమాల శాటిలైట్‌ హక్కులన్నింటినీ ఇప్పటికే కొనుగోలు చేసేశాడట సల్లూ భాయ్‌. ఇంతవరకు భారతీయ చిత్రసీమలో ఏ స్టార్‌ హీరోకూ.. సొంత టీవీ ఛానల్‌ అన్నది లేదు. ఇప్పుడీ రికార్డును తన ఖాతాలో వేసుకోబోవటం గొప్ప విషయం అంటున్నారుసల్మాన్‌ అభిమానుల. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.