కత్రినా పెళ్లికి హాజరు కానున్న సల్మాన్? క్లారిటీ ఇచ్చిన సల్మాన్ సోదరి అర్పిత..?

బాలీవుడ్ ప్రేమపక్షులు కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ డిసెంబర్ 9వ తేదీ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే వీరి పెళ్లి పనులు పెద్దఎత్తున జరుగుతున్నాయని, ఇప్పటికే కత్రినా కైఫ్ తన పెళ్లికి పిలవాల్సిన అతిథులను సన్నిహితులకు ఆహ్వానం పంపినట్లు సమాచారం.ఇదిలా ఉండగా కత్రినాకైఫ్ పెళ్లికి తన మాజీ ప్రియుడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హాజరవుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీకీ సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ ను పరిచయం చేశారు. అలాగే వీరిద్దరి మధ్య కొన్ని సంవత్సరాల పాటు రిలేషన్ కూడ ఉందని చెప్పవచ్చు.

కత్రినా తన కెరియర్ పై దృష్టి సారించడం వల్ల వీరి లవ్ బ్రేకప్ అయ్యింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ప్రేమలో పడి ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అయితే తన పెళ్లికి సల్మాన్ వస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత స్పందించారు. సోషల్ మీడియాలో కత్రినాకైఫ్ తమ కుటుంబానికి ఆహ్వానం పంపినట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఇందులో నిజం లేదు. కత్రినా కైఫ్ తమ కుటుంబానికి ఏ విధమైనటువంటి ఆహ్వానం పంపలేదని ఈమె క్లారిటీ ఇచ్చారు.

అయితే ఉద్దేశపూర్వకంగానే కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ ను తన వివాహానికి పిలవ లేదా?లేక పెళ్లికి మరికాస్త సమయం ఉండటంవల్ల త్వరలోనే తన కుటుంబాన్ని తన వివాహానికి ఆహ్వానిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇకపోతే డిసెంబర్ 9 వ తేదీ ఈమె వివాహం జరుగగా 7, 8 వ తేదీలలో మెహందీ సంగీత్ వంటి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఈమె వివాహం కేవలం సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య ఎంతో వైభవంగా జరగనుందని తెలుస్తోంది.