స్వలింగ సంపర్కం నైతిక విరుద్ధమని పేర్కొంటూ సమాజంలో ఒక వర్గాన్ని చట్టంలోని ఒక సెక్షన్ నేరస్థులుగా చిత్రీకరించడం రాజ్యాంగం కల్పించిన సమాన హక్కుకు విరుద్ధమని ఆ మధ్యన ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై దేశం మొత్తం చర్చ కూడా జరిగింది. ఈ నేపధ్యంలో ఇదే పాయింట్ తో సినిమా తో సినిమా మొదలెట్టింది బాలీవుడ్. అయితే అందుకు మన సౌత్ హీరోయిన్ ని రెజీనా ని ఆ పాత్రకు తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే…ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రెజీనా ‘ఏక్ లడ్‌కీ కో దేఖాతో ఐసా లగా’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది.అయితే ఈ చిత్రంలో సోనమ్, రెజీనా ప్రేమికులుగా కన్పించబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో సోనమ్ స్వీటీ పాత్రలో నటిస్తున్నారు.
అయితే స్వీటీకి త్వరగా పెళ్లిచేయాలని ఆమె కుటుంబం భావిస్తుంది. కానీ స్వీటీ మాత్రం జీవితంలో సరైన వ్యక్తితో ప్రేమలో పడి అప్పుడు పెళ్లిచేసుకోవాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో సోనమ్ రెజీనాతో ప్రేమలో పడుతుందట. అంటే స్వలింగ సంపర్క ప్రేమికులుగా వీరిద్దరూ నటించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లోనూ సోనమ్, రెజీనా జంటగా కన్పించడంతో నెటిజన్లలోనూ ఇదే సందేహం రేకెత్తింది.
ఇక అనిల్ కపూర్, సోనమ్ కపూర్ ఇందులో తండ్రీకూతుళ్లుగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్‌కుమార్ రావ్ హీరో. షెల్లీ చోప్రా ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రంలో జూహీ చావ్లా కీలక పాత్రలో నటించారు. తొలిసారి అనిల్, సోనమ్ తండ్రీకూతుళ్లలా నటించిన చిత్రమిది. వినోద్ చోప్రా ఫిలింస్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.