“మీ టు ఉద్యమం మహిళల రక్షణ కవచం” రవీనా టాండన్

సినిమా రంగంలో మహిళలను తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకోవడం అన్నది మొదటి నుంచి వుంది . అయితే ఒక్కప్పుడు పరిశ్రమలో వున్నవారు బయటికి చెప్పుకునేవారు కాదు . సినిమా రంగంలో కొనసాగాలనుకునేవారు  లొంగిపోయే వారు . ఇష్టంలేని వారు బయటకు వెళ్ళిపొయ్యేవారు . ఒకప్పుడు మహిళలు అభద్రతా భావంతో ఉండేవారు . తమ భాధను ఎవరితోనూ పంచుకునేవారు కాదు . మనసులోనే దాసుకొని కుళ్లిపోయే వారు .  ఇప్పుడు “మీటు ” ఉద్యమంగా వచ్చేసింది . మహిళలను సెక్స్ కోసం వేధించే పురుషులను వీరు ఇప్పుడు బయట పెడుతున్నారు . దీనిపై బాలీవుడ్ నటి రవీనా టాండన్  స్పందించారు . ప్రస్తుతం  రవీనా ముంబై లో మహిళలపై అరాచకాలను నిరోధించే
కమిటీలో సభ్యురాలుగా  ఉన్నారు .

“ఒకప్పుడు సినిమా రంగంలో పనిచేస్తున్న మహిళలకు ఇలాంటి  స్థితి  ఎదురైనప్పుడు , ఎక్కడికి వెళ్ళాలో , ఎవరితో చెప్పుకోవాలో తెలిసేది కాదు , వారిలో వారు నరక యాతన అనుభవించేవారు . కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఉత్పన్నమైనప్పుడు ఎక్కడికి వెళ్లాలో వారికి తెలుసు. వారు నిర్భయంగా కమిటీ ముందుకు వచ్చి తమకు ఎదురైనా చేదు అనుభవాన్ని వివరిస్తూన్నారు .  ఇది మంచి పరిణామం . దీనివల్ల గతంతో వున్నపరిస్థితుల్లో  చాలా మార్పు వచ్చింది . ఇది చాలా ఆరోగ్యకరమైన  మార్పు , ఒకరకంగా ఇది మహిళలకు రక్షణ కవచం ” అని చెప్పింది
“అయితే కొంత మంది మహిళలు దీనిని  అలుసుగా తీసుకొని లేని వాటిని వున్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు .. ఇది చాలా దురదృష్టం ” అని రవీనా టాండన్  విచారం వ్యక్తం చేసింది .