రణబీర్ కపూర్-ఆలియా భట్ జంట ప్రేమ…పెళ్లి వ్యవహారంపై నిత్యం కథనాలు వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట బ్రేకప్ అయిందని కొందరంటే… ఇప్పటికే సీక్రెట్ పెళ్లి అయిపోయిందని మరికొందరు.. ఇంకొంత మంది పెళ్లికి రెడీ అవుతున్నారని.. ఏడాది కాలంగా భిన్న కథనాలతో మీడియాలో హాట్ టాపిక్ గా నలుగుతున్నారు. బ్రేకప్ అయిందా? సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారా? లేక వివాహ బంధంతో ఒకటవుతారా? అన్నది మరోసారి చర్చకు దారి తీసింది. ఈ జంట ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి చేసుకుంటున్నట్లు ఓ జాతీయ పత్రికలో ప్రత్యేక కథనం వెలువడింది.
పెళ్లి వేడుకలు నాలుగు రోజుల పాటు జరుగుతాయని..డిసెంబర్ 21న వివాహ వేడుకలు ప్రారంభమవుతాయని సదరు కథనం వెల్లడించింది. అలాగే డెస్టినేషన్ తరహా వెడ్డింగ్ ప్లాన్ చేసినప్పటికీ రణబీర్ కపూర్ తండ్రి రిషీ కపూర్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ముంబైలో వివాహం జరగనుందిట. ఈ ప్రచారం బాలీవుడ్ సహా టాలీవుడ్ లో హీట్ పెంచుతోంది. ఇప్పటికే ఈ జంట మనస్పర్థలు కారణంగా విడిపోయారని టాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. తాజా సమాచారంతో విడిపోయిన జంట అంటూ ఇప్పటివరకూ జరిగిన ప్రచారం ఉత్తుత్తే అని తేలింది.
ప్రస్తుతం రణబీర్-అలియా `బ్రహ్మాస్త`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఈ సినిమా పెండింగ్ షూట్ కి ఇబ్బందిగా మారిందట. 2020 డిసెంబర్ లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీలో అమితాబచ్చన్..నాగార్జున తదితరులు నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కు సన్నాహకాలు జరుగుతున్నాయి. డిసెంబర్ లో బ్రహ్మాస్త్ర రిలీజ్ అనంతరం రణబీర్-ఆలియా పెళ్లి బాజా మోగనుంది.