ఆ బూతు వీడియో చూడమని రికమెండ్ చేస్తోంది
ఎఎల్టీ బాలాజీ వారి ‘గందీ బాత్ ‘ వెబ్ సీరీస్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. యూత్ అయితే ఆ బూతుకు పిచ్చెక్కిపోయారు! ఆడ, మగా తేడా లేకుండా అందరు ఎగబడి చూడటంతో గందీ బాత్ మూడో పార్ట్ కు సిద్దమైంది. ఈ వెబ్ సీరిస్ లో నటించే నటీమణులు వీలైనంత ఘాటుగా నటించి పాపులారిటీ సాధిస్తూంటారు. రీసెంట్ గా ఈ మూడో పార్ట్ కు సంభందించి ట్రైలర్ విడుదలైంది.
ఈ ట్రైలర్ చూస్తుంటే ఫస్ట్ ,సెకండ్ సీజన్ ను మించి అన్నట్టుగా ఉంది. గందీ బాత్ మొదటి రెండు పార్ట్ లలాగానే ఇందులో కూడా శృంగారంతో నింపేశారు. యూత్ కావల్సిన అంశాలు పుష్కలంగా ఉన్నాయి.బూతు డైలాగులు కూడా ఉండటంతో జనం బాగా చూస్తున్నారు. అయితే పని గట్టుకుని ఏ సెలబ్రెటీ దీని గురించి మాట్లాడరు. కానీ రాఖీ సావంత్ ది రివర్స్ గేర్ కదా. గందీ బాత్ గురించి తెగ చెప్పేస్తోంది.
రీసెంట్ గా తను ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ చూసానని, రాత్రిళ్లు నిద్రపట్టలేదని అంటోంది. ఖచ్చితంగా తన ఫ్యాన్స్ అందరూ చూడాల్సిందే అని రికమెండ్ చేస్తూ ఓ వీడియో సైతం వదిలింది. ఆ సంస్దతో ఏమన్నా ఒప్పందం చేసుకుని పబ్లిసిటీ చేస్తోందో లేక తనకు అవకాసం ఇస్తారని ఇలా మొదలెట్టిందో కానీ కాస్త గట్టిగానే పబ్లిసిటీ చేస్తోంది.