నవాజుద్దీన్ తో రాధికా ఆప్టే రొమాన్స్ చేస్తుందా ?
హాట్ హాట్ భామ రాధికా ఆప్టే తెలుగా . తెలుగులో “రక్త చరిత్ర “, “ద్రోణి”, “లెజెండ్”, “లైన్ ” మొదలైన చిత్రాల్లో నటించింది . శృంగార పాత్ర అయినా నిరభ్యన్తరకరగా నటించే తార రాధిక . గతంలో రంగస్థలంలో , టీవీలో , షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన రాధిక సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేసింది . తెలుగు . తమిళ, మలయాళ , బెంగాలీ , మరాఠీ , హిందీ , ఇంగ్లీష్ చిత్రాల్లో నటిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నది . ఇప్పుడు రాధిక నవాజుద్దీన్ సిద్దిక్వి తో హిందీలో “బదలాపూర్ ” అనే చిత్రాల్లో నటిస్తుంది . 2015లో రాధిక నవాజుద్దీన్ తో మొదటిసారి “మాంజీ ది మౌంటెన్ మాన్ ” అనే చిత్రంలో నటించింది . ఆ చిత్రం హిట్ అయ్యింది .
ఈ ఇద్దరితో మళ్ళీ ” బదలాపూర్ ” చిత్రం రూపొందిస్తున్నారు . ఈ మధ్యనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది . నవాజుద్దీన్ గురించి రాధిక తెగ పొగిడేస్తోంది . “నవాజ్జుద్దీన్ తన సహా నటుడని గర్వగా చెప్పుకుంటాను . అతను చాలా వ్యక్తిత్వం వున్నవాడు అతనితో నటించడం అంటే చాలా చాలా గొప్పగా , ఆనందంగా ,గర్వంగా భావిస్తాను . ” అని చెబుతుంది .
అన్ని సినిమాల్లో , ఇన్ని భాషల్లో నటించిన రాధిక “నవాజుద్దీన్ నుంచి ఎంతో నేర్చుకున్నాను .. అతను సెట్లో ఉంటే సమయమే తెలియదు .. అలా మాట్లాడుతూ ఉంటాడు . నాకు తెలియని ఎన్నో విషయాలు నవాజుద్దీన్ నుంచి నేర్చుకున్నాను ” అని మహా సంతోషంగా చెబుతుంది .
ఎప్పుడూ సహా నటుల అంతగా పొగడని రాధిక నవాజుద్దీన్ గురించి ఈ రకంగా మాట్లాడుతూ వున్నదీ అంటే … ఇద్దరి మధ్య ఎదో ఉందని సినిమా పక్షులు చెవులు కొరికేసుకుంటున్నారు . అయినా సినిమా తారల విషయంలో ఇలాంటి ముద్దు ముచ్చట్లు అతి సహజం . ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు ఒకరినొకరు తెగ పొగిడేసుకుంటారు . అది వారికి సహజం .. కానీ వినే జనానికి అసహజంగా అనిపిస్తుంది . సినిమా గ్లామర్ తెర మీద .. గ్రామర్ తెర వెనుక. ఇది జగమెరిగిన సత్యమే కదా !