ప్రియాంక చోప్రా , నిక్ జోనస్ ల వివాహం ఆదివారం నాడు జైపూర్ లోని ఉమైద్ భవన్ ప్యాలస్ లో వైభవంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేశారు .
ప్రియనక తన కన్నా 10 సంవత్సరాలు చిన్న వాడైన అమెరికన్ ఆర్టిస్ట్ , గాయకుణ్ణి ప్రేమించి వివాహం చేసుకోబోతున్నది .
గత వారం రోజుల నుంచి జోద్ పూర్ ప్యాలస్ లో వివాహ వేడుకలను కన్నుల పండుగగా జరపడానికి భారీ ఆరెంజ్ మెంట్స్ చేస్తున్నారు .
దీపికా పడుకునే వివాహం కన్నా ఈ విహాహం ధూమ్ ధామ్ గా జరపాలని ప్రియాంక కోరుకుంటున్నది . అందుకు తగ్గట్టే అతిధులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు .
ఇక రెండు రోజుల నుంచి ప్రియాంక చోప్రా తరుపు బంధువులు, నిక్ జోనస్ తరుపు చుట్టాలు ప్యాలస్ చేరుకున్నారు .
నిన్న రాత్రి సంగీత్ వేడుకలను హూషారెత్తించారు . గాయని గాయకులతో పాటు హిందీ చిత్ర రంగాన్ని సంబందించిన పలువురు పాల్గొని ఆట పాటలతో ఉర్రుత వూగించారు . ఈ కార్యక్రమంలో ప్రియాంక ,నిక్ బాలీవుడ్ పాటలకు నృత్యం చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది . అర్ధరాత్రి పెద్ద ఎత్తున బాణ సంచా కూడా కాల్చారు . ఈరోజు రాత్రికి బాలీవుడ్ తారలు తరలి వెడతారు .
రేపు పప్రియాంక నీకేలా వివాహం భారతీయ హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతుంది . ఎల్లుండి క్రైస్తవ మతం ప్రకారం జరుగుతుంది .