పెళ్లైన నాలుగు రోజులకే పిచ్చ హాట్ గా రెచ్చిపోయింది!

పెళ్లైతే సినిమా స్టార్స్ కు క్రేజ్ తగ్గిపోతుందంటారు..అయితే హాలీవుడ్ లో రివర్స్ లో నడుస్తూంటుంది. అక్కడ పెళ్లైన వాళ్లు మరింత హాట్ గా తయారై..తన అందాల ప్రదర్శనకు అవధులు చెరపేస్తూంటారు. హాలీవుడ్ కు వలస వెళ్లి అక్కడ వారికి కోడలు గా మారిన ప్రియాంక చోప్రా…వారి పద్దతులను అప్పుడే వంటబట్టించుకున్నట్లుంది. పెళ్లైన నాలుగు రోజులుకే హాట్ హాట్ ఫోజులతో పత్రికలెకెక్కింది. ఇది చూసిన మన ఇండియన్స్ హవ్వ..ఇదేం పని అంటూంటే..అక్కడివారు వావ్ …అంటూ మెచ్చుకుంటున్నారు.

అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో ప్రేమ కలాపం జరిపి, రీసెంట్ గా పెళ్లి చేసుకొని ఓ ఇంటిదైంది ప్రియాంక చోప్రా. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో వీరి వివాహం భారీ స్థాయిలో అంగరంగ వైభోగంగా జరిగింది. అయితే ఆ పెళ్లి వేడుకలు అలా ముగియగానే… ప్రియాంక తాజాగా ప్రఖ్యాత వోగ్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది.

వోగ్ మ్యాగజైన్ జనవరి 2019 కవర్ పేజిపై తన హాట్ అందాలతో తళుక్కున మెరిసింది. ఈ జనవరి ఇష్యూలో ప్రియాంక ప్రేమ కథనం పై క్లియర్ స్టోరీ ఉంది. ఇక ఈ ఫోటో ఆమె అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. క్రీమ్ కలర్ డిజైనర్ వేర్ లో క్లీవేజ్ షో చేస్తూ సూపర్ హాట్ గా అదిరిపోయింది.

ఇక ఈ ఫోటోకు ఎంత క్రేజ్ వచ్చిందంటే…ప్రియాంక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా లో దీన్ని పోస్ట్ చేసిన 17 గంటల్లోనే ఈ ఫోటోకు 1.8 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇంకో విషయం … నిక్ ను వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక పాపులారిటీ రెట్టింపు అయ్యింది. నిక్ అభిమానులు సైతం ప్రియాంకకు అభిమానులుగా మారారు మరి.