ప్రేమకు మతం , కులం , ప్రాంతం లేదని అంటారు . ఇక ఇప్పుడు వీటికి తోడు మరొకటి కూడా చేరిపోయింది . అదే వయసు . గతంలో కూడా మగవాడు తన కంటే పెద్ద డైన అమ్మాయిని వివాహం చేసుకున్న సందర్భాలు అనేకం వున్నాయి . ఇక సినీ రంగానికి వస్తే అలాంటి ఘటనలు ఛాయా అరుదుగా కనిపిస్తాయి . మదర్ ఇండియా సినిమాలో నర్గిస్ కుమారుడుగా నటించిన సునీల్ దత్ ను వివాహం చేసుకుంది . అయితే
సునీల్ నర్గిస్ కన్నా కొన్ని రోజులు చిన్నవాడు . అయితే ఇప్పుడు ప్రియాంక చోప్రా తన కన్నా 10 సంవత్సరాలు చిన్నవాడైన అమెరికాలోని డల్లాస్ నివాసి నిక్ జోనస్ ను వివాహం చేసుకో బోతున్నది .
దీపికా పదుకొనె , రణ్వీర్ సింగ్ వివాహం తరువాత ప్రపంచమంతా ఇప్పుడు వీరి వివాహం గురించే చర్చించుకుంటున్నారు. నిక్ జోనస్ గాయకుడు , పాటల రచయిత , నటుడు . అనుకోకుండా వీరి పరిచయం ప్రేమగా మారింది . ప్రేమకు వయసు లేదని నిక్ నిరూపించాడు . నిక్ సెప్టెంబర్ 16 ,
1992లో డల్లాస్ జన్మించాడు . ప్రియాంక 18 జులై 1982లో జంషెడ్పూర్ , బీహార్లో జన్మించింది . వీరి వివాహం ఉమైద్ భవన్ ప్యాలస్ లో డిసెంబర్ ి1 న జరుగుతుందని ప్రియాంక ప్రకటించింది .