ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే పుల్ బిజీ అయిన మళయాళి కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె తాజాగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేశారు. ఆమె నటిస్తున్న తొలి హిందీ సినిమాకు ‘శ్రీదేవి బంగ్లా’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. ప్రశాంత్ మాంబుల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా కూడా ఓ కీలకపాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.70 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట.
అలాగే ఈ చిత్రాన్ని కేవలం 19 గంటల్లోనే షూట్ చేసారట. వివిధ ప్రదేశాల్లో ఒకేసారి ఏడు కెమెరాలతో సినిమా చిత్రీకరణను పూర్తిచేయడం విశేషం.
ఇక బీకామ్ చదువుతున్న 18 ఏళ్ల కేరళ కుట్టి ప్రియ ప్రకాష్ వారియర్ ఆ మధ్యన సోషల్ మీడియాను షేక్ చేసేసింది. ఫేస్‌బుక్.. ట్విట్టర్.. వాట్సాప్.. ఎక్కడ చూసినా ప్రియ వీడియోలో హల్‌చల్ చేసాయి. కేరళ త్రిసూర్‌కు చెందిన ప్రియ ‘ఒరు ఆధార్ లవ్’ సినిమాతో తెరంగేట్రం చేస్తోంది.
ఈ సినిమాలోని ‘మాణిక్య మలయ పూవి’పాటకొ వాలంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీలోని పాటను కొంచెం ముందుగా విడుదల చేశారు. ఈ పాటకు అనూహ్య స్పందన లభించింది. కన్ను గీటుతూ ఆ పాటలో ప్రియ పలికించిన హావభావాలకు నెటిజన్లంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఆ చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకుడు ఒమర్ లులు ట్విటర్ వేదికగా తెలిపారు.