ప్రభాస్ “ఆదిపురుష్”పై బిగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ ఓంరౌత్.!

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు భారీ సినిమాలు కోసం అందరికీ తెలిసిందే. ఆ చిత్రాల్లో దర్శకుడు ఓంరౌత్ తో చేసిన మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ మైథలాజికల్ డ్రామా “ఆదిపురుష్” కూడా ఒకటి.

హిందీ మరియు తెలుగు భాషల్లో ఒకేసారి తీసిన ఈ చిత్రంలో కృతి సనన్ జానకి దేవిగా నటించగా ప్రభాస్ శ్రీరామునిగా నటించాడు. అయితే ఈ చిత్రం అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా చిత్ర యూనిట్ అయితే సినిమా షూటింగ్ అయ్యిపోయిన కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు.

అయితే ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఓ కొలిక్కి వస్తుండగా ఫైనల్ గా దర్శకుడు అయితే ఓ అప్డేట్ ని ఇప్పుడు అందించాడు. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా 3డి లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

మరి ఇప్పుడు ఈ టెస్ట్ కోసం లాస్ ఏంజెల్స్ ఉన్న ఐమ్యాక్స్ లో టెస్ట్ కోసం తాను వెళ్లి సక్సెస్ అయ్యాడు. దీనితో ఈ హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకొని ఆదిపురుష్ రిలీజ్ డేట్ కోసం నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు. దీనితో ఇపుడు ఈ పోస్ట్ అయితే వైరల్ గా మారిపోయింది.