ప్రభాస్ “ఆదిపురుష్” పై ఈ విషయంలో డౌటే లేదట..బాలీవుడ్ వర్గాల మాట.!

ప్రభాస్ పేరు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడ ఉందో అందరికీ తెలిసిందే. మరి తాను నటిస్తున్న పలు సంచలన ప్రాజెక్ట్ లలో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో చేసిన భారీ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి.

అయితే ఈ సినిమాని స్టార్ట్ చేసిన నాటి నుంచే చిత్ర యూనిట్ ఈ సినిమాని ఇండియన్ సినిమా దగ్గర నెవర్ బిఫోర్ లెవెల్లో చూపిస్తామని తెలిపారు. అయితే వారు ఆ మాట మీదే ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఆడియెన్స్ మరియు అభిమానుల్లో ఒక క్లారిటి మాత్రం లేకుండా పోయింది.

అందుకే అసలు సినిమాలో విజువల్స్ ఎలా ఉంటాయా అనే దానిపై అట్లీస్ట్ ఒక అప్డేట్ అయినా వస్తే బాగుండేది అని అంటున్నారు. అయితే ఈ డౌట్ ఉన్న వారికీ బాలీవుడ్ వర్గాలు ఏం చెప్తున్నాయంటే ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ విషయంలో ఎలాంటి డౌట్స్ పెట్టుకోనక్కర్లేదట.

స్యూర్ షాట్ గా హాలీవుడ్ లెవెల్ అవుట్ పుట్ ఆదిపురుష్ లో కనిపిస్తుంది అని డెఫినెట్ గా అందరినీ ఈ సినిమా స్టాండర్డ్స్ మెప్పిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో కనిపించే నీలి రంగు టోన్ అలాగే ప్రభాస్ లుక్ ఊహించని లెవెల్లో ఉంటాయని ఆడియెన్స్ డెఫినెట్ గా థ్రిల్ అవుతారని అంటున్నారు.

ఒకవేళ గాని ఈ సినిమా అంచనాలు అన్నీ అందుకుంటే మాత్రం బాక్సాఫీస్ దగ్గర సునాయాసంగా 1000 కోట్లు కొల్లగొట్టేస్తుంది అని చెప్పాలి. ఇక అంతా అయితే ఓంరౌత్ చేతుల్లోనే ఉంది.