బాలీవుడ్ లో భారీ జంప్ అందుకున్న నిఖిల్ “కార్తికేయ 2”..!

ప్రస్తుతం బాలీవుడ్ మార్కెట్ దగ్గర తెలుగు సినిమాలు ఎలాంటి పెర్ఫామెన్స్ ని కనబరుస్తున్నాయి చూస్తూనే ఉన్నాము. అయితే బాలీవుడ్ లో అక్కడి స్టార్ హీరోల సినిమాలే రాణించలేని పరిస్థితిలో ఇప్పుడు మన తెలుగు యంగ్ హీరో నిఖిల్ అక్కడ పాగా వేసాడు. తాను హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “కార్తికేయ 2”.

ఇండియన్ సినిమా దగ్గర ఒక ట్రెండింగ్ టాపిక్ గా మారింది. మన భారతదేశ ఇతిహాసంలో శ్రీ కృష్ణ జన్మపై దానికి సైన్స్ ని ముడిపెట్టి అద్భుతంగా తీసిన ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసలు కురిసాయి. అయితే ఈ సినిమా హిందీ రిలీజ్ మొదట్లో కాస్త నెమ్మదిగానే స్టార్ట్ అయినా ఇప్పుడు ఆరో రోజుకి వచ్చేసరికి భారీ జంప్ ని అక్కడి మార్కెట్ లో అందుకొని సెన్సేషన్ గా మారిపోయింది.

దీనితో హీరో నిఖిల్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మొదటి రోజు హిందీలో జస్ట్ 50 స్క్రీన్స్ తో మొదలైన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 1000 స్క్రీన్స్ కి అందులోని 3 వేలకి పైగా షోస్ కి చేరుకున్నందుకు ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ సినిమా చూసి ఎంజాయ్ చెయ్యాలని కోరుకుంటున్నానని తెలిపాడు.

అయితే 50 నుంచి 3000 కి పెరగడం అనేది చిన్న విషయం అయితే కాదని చెప్పాలి. మొత్తానికి అయితే ఈ చిత్ర యూనిట్ కోరుకున్న ట్రూ సక్సెస్ అదిరే లెవెల్లో వచ్చింది. మరి ఈ సినిమాలో అయితే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించారు. అలాగే చందూ మొండేటి దర్శకత్వం వహించాడు.