పాపం ఆలియా భట్..”బ్రహ్మాస్త్ర” పై మామూలు ట్రోల్స్ పడట్లేదుగా..!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ అయ్యిన లేటెస్ట్ చిత్రం “బ్రహ్మాస్త్ర”. బాలీవుడ్ దగ్గర తెలుగు సినిమాలు కన్నడ సినిమాలు భారీ లెవెల్లో డామినేట్ చేస్తున్న తరుణంలో అక్కడ నుంచి మంచి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి వచ్చిన బిగ్గెస్ట్ సినిమా ఇది.

అయితే ఓపెనింగ్స్ పరంగా సెన్సేషనల్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రంపై నెగటివ్ టాక్ మాత్రం ఇంకా తగ్గలేదు. అయితే ఈ సినిమా చూసాక కొన్ని విషయాల్లో మరిన్ని ట్రోల్స్ ఈ సినిమాపై పడుతున్నాయి. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ జంట రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ లు నటించారు.

అయితే ఇప్పుడు ఆలియా భట్ పై ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రోల్స్ కనిపిస్తున్నాయి. ఈ సినిమా మొత్తంలో ఆలియా భట్ కి ఒకే ఒక డైలాగ్ ఇచ్చారని సినిమా అంతా ఆమె అదే చెప్తూ వెళ్ళిపోతుంది అంటూ నార్త్ సైడ్ సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్ వేస్తున్నారు.

దీనితో సినిమాలో ఆమె రోల్ ఏమో కానీ ఆమె చెప్పిన శివ అనే డైలాగ్ మాత్రం తనకన్నా పాపులర్ అయ్యిపోయింది. దీనితో ఈరకంగా అయితే ఆలియా భట్ విషయంలో ఫన్నీ ఇన్సిడెంట్ జరుగుతుంది.