సిగ్గుండాలి…మీ భార్య కూడా అలాంటిదేగా

మీటూ ఉద్యమం దేశంలో రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. అయితే ఈ వివాదాన్ని అడ్డం పెట్టి వివాదాలు, విభేధాలు, పంచాయితీలు మొదలయ్యాయి. ఒకరిపై మరొకరు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. పచ్చి పచ్చి గా మాట్లాడేస్తున్నారు. ఇన్నాళ్లు పెద్ద మనుష్యులుగా వెలిగిన చాలా మంది అంతరంగిక జీవితాలు ఒక్క రోజులో రోడ్డుపై పడటం చాలా మందికి మింగుడు పడటం లేదు.

దాంతో కొందరు తమను తాము ఎక్సపోజ్ చేసుకోవటానికి కొందరు సినిమా అమ్మాయిలు చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ గా దీన్ని కొట్టిపారేస్తున్నారు. అయితే అలా మట్లాడిన వాళ్లకు జనం కౌంటర్స్ ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ మాజీ హీరో, నటుడు జాకీ ష్రాఫ్ కు అదే పరిస్దితి. ఆయన నోటి దూలతో మీటూ పై మాట్లాడిన మాటలు బూమరాంగ్ లా తిరిగి వచ్చి ఆయనకే తగులుతున్నాయి.

రీసెంట్ గా జాకీ ష్రాఫ్‌ స్పందిస్తూ..ఎప్పుడో చాలా తాసం క్రితం జరిగిన ఏవో కొన్ని విషయాలను పట్టుకుని ఇప్పుడు కొంతమంది ముందుకు రోడ్డు పైకి వస్తున్నారు. కొందరైతే ఎదుటివారి తప్పులను ఎత్తి చూపేందుకు బయిలుదేరారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి బజారుకెక్కి రచ్చ చేస్తున్నారు’ అంటూ కొంచెం హార్డ్ గా మాట్లాడారు.

ఈ విషయమై మోడల్‌, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ డయాండ్రా సోర్స్ తీవ్రంగా స్పందించారు. ఆమె బ్రాండ్ కన్సల్టెంట్ సుహెల్ సేథ్(55)పై ఆరోపణలు చేసి ఈ మధ్యనే వార్తల్లో నిలిచారు. ఆమె చాలా సీరియస్ గా జాకీష్రాఫ్ ని మాటలతో ఎదుర్కొన్నారు. ‘ ఈ కామెంట్స్ తో జాకీ ష్రాఫ్‌పై ఉన్న గౌరవం పోయింది. మీరు చేసిన పనుల తాలూకు మకిలిని బజారుకెక్కి శుభ్రం చేసుకోవాలని చూస్తున్నారు. మీ భార్య కూడా గతంలో ఇలాంటి పనులు చేసింది కదా. మరి దానికి ఏం అంటారో’ అంటూ ఎదురు ప్రశ్నించారు.

జాకీ ష్రాఫ్‌ భార్య అయేషా మాజీ మోడల్‌ . ఆమె తన కంటే చిన్నవాడైన ఓ యంగ్ మోడల్‌తో అయేషా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారంటూ అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని గుర్తు చేసిందామె.