మిస్ వలర్డ్ ‘హాట్ ఫొటో’ లతో హీట్ పెంచేస్తోంది

భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ ఇప్పుడు హాట్ ఫొటో లతో కుర్రకారు గుండెలను దడదడలాడిస్తోంది. ఓ ప్రక్కన చదువుకుంటూనే మరొకవైపు మోడలింగ్ పై దృష్టి పెట్టింది. రీసెంట్ గా ప్రముఖ జువెలరీ సంస్థ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ తాజాగా మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లర్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఆ తర్వాత ఆమె దృష్టి సినిమాలపై పడిందో ఏమో సోషల్ మీడియాను మాత్రం తన హాట్ లుక్ లతో వేడిక్కించేస్తోంది.

ఆమె ఎంపికైన వెంటనే..మీడియా వారు ఎప్పుడు మీ బాలీవుడ్ ఎంట్రీ అని అడిగేసారు. దానికి ఆమె‘ఇప్పటికైతే నా మిస్‌ వరల్డ్‌ అక్కచెల్లెళ్లతో రుతుక్రమ శుభ్రత పై అవగాహన పెంచడానికి ప్రపంచమంతా తిరుగుతున్నాం’ అని చెప్పింది చిల్లర్‌.

అక్కడితో ఆగకుండా..బాలీవుడ్ కు రావాలంటే.. ఆమిర్‌ఖాన్‌ పిలిస్తే వస్తా. ప్రియాంకా చోప్రా తలిస్తే వస్తా అంది చిల్లర్‌.‘వీళ్లిద్దరేనా, ఇంకెవరు పిలిచినా రా?’ అంటే…‘ఆమిర్‌ ఖాన్‌ చేసే సినిమాల్లో, పాత్రల్లో ఒక చాలెంజ్‌ ఉంటుంది. సమాజంలో ఉన్న చాలెంజ్‌ ఉంటుంది. కొత్త దనం తేవాలన్న చాలెంజ్‌ ఉంటుంది. ఇక ప్రియాంకా చోప్రా అంటారా.. నా ఫేవరేట్‌. 2000లో తనూ ‘మిస్‌ వరల్డ్‌’గా దేశానికి వన్నె తెచ్చింది. 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు నేనూ ఆమెను… ఫాలో చేస్తున్నా.’ అంది మానుషీ.