ఇది బయోపిక్ ల సీజన్. ఇప్పటికే తెలుగునాట ఎన్టీఆర్, వైయస్ వంటివారు బయోపిక్ లు పోటీ పడి తెరకెక్కితే…బాలీవుడ్ కూడా రాజకీయనాయకుల బయోపిక్ లు తెరకెక్కించే పనిలో పడింది. ఎన్నికల వేళ..ఇప్పటికే డజను బయోపిక్ లు ఆన్ సెట్స్ లో ఉండి హల్ చల్ చేస్తున్నాయి. అంతకు ముందు తెరక్కించిన జీవిత కథలు మంచి సక్సెస్ సాధించడంతో వాటికి మరింత గిరాకీ పెరిగింది. దీంతో దర్శకులు కూడా అమితాసక్తి చూపిస్తున్నారు.
తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బయోపిక్ తెరకెక్కుతుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. `భాఘిని `అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న సినిమా మమతా బయోపిక్ అంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ రూమర్ పై మమతా బెనర్జీ స్పందించారు.
What is all this nonsense being spread! I have nothing at all to do with any biopic. If some young people have collected stories & expressed themselves, that’s up to them.Not related to us. I am not Narendra Modi.
Please do not compel me to file for defamation by spreading lies— Mamata Banerjee (@MamataOfficial) April 24, 2019
ఈ వార్తల్లో నిజం లేదు. నాకు ఏ బయోపిక్ తో సంబంధం లేదు. కొన్ని కథలు సిద్దం చేసుకుని, వాటిని తమకు అనుకూలంగా మలుచుకుని బయోపిక్ లు గా చెప్పుకుంటున్నారు. అది నా బయోపిక్ ఎలా అవుతుంది? అయినా నా బయోపిక్ తీసేందుకు నేను నరేంద్ర మోదీని కాదు. ఇలాంటి అసత్యాలను ప్రచారం చేయవద్దు.
ఇదే కొనసాగితే పరువు నష్టం దావా వేస్తా. నా జాబ్ నన్ను చేసుకోనివ్వండి. మీ మీద నన్న కాన్నంట్రేట్ చేసేలా చేసుకోవద్దు` అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో బాఘిని దర్శకుడు ఇది బయోపిక్ కాదు..ఆమెను ఆదర్శంగా తీసుకుని చేస్తోన్నసినిమా అని వివరణ ఇచ్చారు.