లాస్ట్ జెనరేషన్ కుర్రాళ్లకు బోల్డ్ నెస్ అంటే ఏంటో రుచి చూపించిన సుందరి మల్లికా షెరావత్. ‘మర్డర్’ లాంటి సినిమాలతో ఆమె క్రేజు తో చెలరేగిపోయింది. అయితే ఆమె కు ‘మర్డర్’ తర్వాత ఆ స్దాయి సినిమా పడలేదు. కానీ ఆ ఒక్క సినిమానే చాలా సంవత్సరాల పాటు ఆమెకు ఆఫర్స్ తెచ్చి పెట్టింది.
అయితే ఈ మధ్యకాలంలో ఆమె ఫేడవుట్ అయ్యిపోయింది. సినిమా ఆఫర్స్ తగ్గిపోయాయి. అలాగే ఆమె కూడా తన అంద చందాల ప్రదర్శన తగ్గించేసింది. కానీ దాదాపు పదేళ్ళకు మళ్ళీ తన హాట్ లుక్ ని వదిలింది.
ఈమధ్యే తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా లేటెస్ట్ గా ఫోటో షూట్ చేసిన హాట్ స్టిల్స్ పోస్ట్ చేసింది. ఆ ఫొటోలలో ఆమె ఏదో ఇన్నర్ వేర్ యాడ్ కోసం అందచందాలు ఆరబోసినట్లుంది. ఓ డిఫరెంట్ స్టైల్లో బెడ్ మీద సైడ్ కు తిరిగి కూర్చుంది. బ్లాక్ అండ్ వైట్ షేడ్ లో ఫోటో కావటంతో మల్లికా మహా సెక్సీగా ఉంది. ఫోటో చూసి ఆమె పాతికేళ్ళ భామ అని కుర్రాళ్లు మోసపోతారేమో అనిపించేంతలా ఉంది. ‘మర్డర్’ సినిమా చేసింది ధర్టీస్ లో . ఇప్పుడు వయసు నలభై పైనే..
గత కొంతకాలంగా ఆమె చేతిలో సినిమాలు లేవు దాంతో లవర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ కాలక్షేపం చేస్తోంది . అప్పుడప్పుడూ ఫొటోలు దిగుతూ ఇదిగో ఇలా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ జనాలకు ఆనందాన్ని పంచుతోంది మల్లికా శెరావత్ . కరణ్ సింగ్ ని పెళ్లి చేసుకొని ఏడాది కాపురం చేసిన తర్వాత విడాకులు ఇచ్చిన ఈ భామ రీసెంట్ గా ఓ విదేశీయుడితో సహజీవనం చేస్తోంది.