బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ నటి మలైకా అరోరా ప్రేమలో ఉన్నారని గత కొన్నేళ్లుగా వార్తలు వస్తున్న జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తమ మధ్య ఏమీ లేదని అర్జున్, మలైకా పలుమార్లు చెప్పారు. కానీ ఈ జంట కలిసి పార్టీల్లో కనిపించడం, టూర్స్ కు వెళ్లడంతో.. వారి మాటల్లో నిజంలేదని జనాలకు అర్దమైంది.
రీసెంట్ గా వీరిద్దరూ వచ్చే సంవత్సరం ప్రారంభంలో పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ విషయమై బాలీవుడ్ మీడియా తాజాగా మలైకాను ప్రశ్నించింది. దీనికి మలైకా సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ తెలివిగా స్పందించారు.
మలైకా మాట్లాడుతూ.. ‘పర్శనల్ ప్రశ్నలకు నేనెప్పుడూ సమాధానం చెప్పను. అలా చెప్పటం లేదంటే అర్థం నేను సిగ్గుపడుతున్నానని కాదు. నా పర్శనల్ జీవితం గురించి మాట్లాడటం నాకు ఇబ్బందికరంగా ఉంటుందని. నా జీవితంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా.. అది చాలా అందంగా ఉంది. ఎంతో విలువైనది’ అని మలైకా చెప్పారు. ఇది విన్న వారంతా వారి వివాహాన్ని ఆమె కొట్టిపారేయలేదు అంటే ఖరారు చేసింది అంటున్నారు.
కాగా 1998లో అర్బాజ్ ఖాన్‌ను మలైకా వివాహం చేసుకుంది. దాదాపు 19 సంవత్సరాలు ఈ ఇద్దరు కలిసి ఉన్నారు. వీరికి అర్హాన్ ఖాన్(15) అనే బాబు కూడా ఉన్న విషయం తెలిసిందే. మలైకా, అర్జున్ ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నారు. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌తో మలైకా విడాకులు తీసుకోవడానికి కూడా కారణం అర్జున్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి. గతేడాది విడాకుల తరువాత అర్జున్- మలైకాల వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించినట్లు కూడా సమాచారం.