షారుక్ ఖాన్ బర్త్ డే కోసం ప్రత్యేక మీరట్ సెట్

షారుక్ ఖాన్ , కత్రినా కైఫ్ , అనుష్క శర్మ తో  ఆనంద్  దర్శకత్వంలో నిర్మించిన “జీరో ” సినిమా ట్రైలర్  ను  నవంబర్ 2 న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు . నవంబర్ 2 షారుక్ ఖాన్ జన్మదినోత్సవం  కావడం విశేషం . జీరో సినిమాలో షారుక్ ఖాన్  మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నాడు . ఈ సినిమాపై బాలీ వుడ్ లో భారీ అంచనాలే వున్నాయి .

ఈ చిత్రాన్ని  రెడ్ చిల్లీస్  ఎంటర్టైన్మెంట్స్ , కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మించారు .ఈ చిత్ర ట్రైలర్ విడుదల కోసం మీరట్ నగరాన్ని తలపింపజేసే విధంగా భారీ సెట్ వేయించారట . అన్ని సినిమాల్లో లాగే అభిమానులను పిలవడం ట్రైలర్ విడుదల చేయడం కాకుండా విభిన్నంగా  చేయాలనుకుంటున్నారు . ఈ సెట్లో  అనేక షాపులు , అందులో ఫుడ్ ఐటమ్స్ , సరదాగా ఆదుకోవడానికి అనేక రకాలైన గేమ్స్  ఉంటాయట . ఇక చిత్రంలో నటించిన నటీనటులంతా  వచ్చిన అభిమానవులతో, జర్నలిస్టులతో షారుక్ హాయిగా గడుపుతారట .

“జీరో ” ట్రయిల్ లాంచ్  ఒక పిక్ నిక్ లా ఉల్లాసంగా సాగుతుందని అంటున్నారు . షారుక్ ఖాన్  తన 53వ జన్మదినాన్ని అభిమానులతో కలసి ఎలా “జీరో ” చిత్రోత్సవంగా జరుపుకుంటున్నాడన్న మాట .