ఫోర్న్ నేను డైలీ చూస్తా..దయచేసి బ్యాన్ చేయద్దు

ఇంతకు ముందు స్వలింగ సంపర్కానికి మద్దుతు పలికి వార్తల్లో నిలిచిన మహికా శర్మ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమె ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలతోనే హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆమె భార‌త్ లో పోర్న్ సైట్లను బ్యాన్ చేయడం సరికాదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అక్టోబ‌ర్ 27న‌ 827 పోర్న్ సైట్ల‌ను బ్యాన్ చేయాల‌ని భార‌త టెలికాం శాఖ ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ను ఆదేశించింది. ఈ నేపధ్యంలో ఆమె స్పందన తెలియచేసింది.

ఆమె వాదన ప్రకారం… పోర్న్ ను బ్యాన్ చేయ‌డం వ‌ల్లే దేశంలో అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి ఘటనలు మరింత పెరుగుతాయని చెప్పుకొచ్చింది. అంతేకాదు పోర్న్ ను బ్యాన్ చేయ‌డం వ‌ల్ల‌..విలేజెస్ లో అమ్మాయిలతో అసభ్య వీడియోలు చిత్రీకరించడం, ఎంఎంఎస్ లు వైర‌ల్ చేయ‌డం వంటి కల్చర్ పెరుగుతుందని అభిప్రాయ‌ప‌డింది.

`నేను రెగ్యుల‌ర్‌గా పోర్న్ సినిమాలు చూస్తాను. పోర్న్‌ను బ్యాన్ చేయ‌డం నాకు న‌చ్చ‌లేదు. పోర్న్‌ను బ్యాన్ చేయ‌డం వ‌ల్ల మాన‌భంగాలు ఏమాత్రం త‌గ్గ‌వు. పోర్న్‌సైట్ల‌ను బ్యాన్ చేయ‌డం వ‌ల్ల పురుషుల‌లో కామ‌వాంఛ‌లు ఇంకా పెరిగిపోతాయి. అందువ‌ల్ల రేప్ లు ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ి`ని మ‌హికా వాదిస్తోంది.

అలాగే పోర్న్ సినిమాలను నిషేధించడం త‌న‌కు నచ్చలేదంటోందీ న‌టి. సమస్యకు ఇది పరిష్కారం కాద‌ని, పోర్న్ బ్యాన్ వ‌ల్ల ఇండియాలో రేప్ ఘటనలు తగ్గవ‌ని చెప్పింది. అస‌భ్య వీడియోల చిత్రీక‌ర‌ణ వంటివి పెరిగిపోతాయ‌ని, ఆ త‌ర‌హా వీడియోల గురించి బాధితులు మాట్లాడేందుకు ముందుకు రార‌ని తెలిపింది. పోర్న్ బ్యాన్ వ‌ల్ల‌….కొందరు త‌మ‌ కామ కోరికలను తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తార‌ని చెప్పింది. గ‌తంలో ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కూడా పోర్న్ పై నిషేధాన్ని వ్య‌తిరేకించిన సంగ‌తి తెలిసిందే.