బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కేదార్‌నాథ్’. ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం… 2013లో ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.
ఆ సమయంలో ఓ యువతీ యువకుడి మధ్య చిగురించిన ప్రేమ కథే గా రూపొందుతోంది. రీసెంట్ గా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఉత్సాహంతో ట్రైలర్ ని సైతం రిలీజ్ చేసారు.
దేవుని దయతో కోసం యాత్రికులు కేదార్‌నాథ్‌కు వస్తుంటారు. వారికి సౌకర్యాలు కల్పించడం మన విధి. రాంబారా ప్రాంతంలో యాత్రికుల కోసం ఓ హోటల్ కట్టించాలని నా విన్నపం. మనం ఎంతమందికి హోటల్‌లో బస ఏర్పాటుచేయగలుగుతామో అంత మంది యాత్రికులనే ఇక్కడికి ఆహ్వానిద్దాం.
నువ్వెక్కడి నుంచి వచ్చావ్ మా మధ్యలోకి? ఎప్పటినుంచో మేం ఇక్కడ ఉంటున్నాం. భక్తిశ్రద్ధలతో జీవిస్తున్నాం. యాత్రికులను మా భుజాలపై మోసుకెళుతున్నాం.’ అని ఓ వ్యక్తి సుశాంత్‌తో అంటారు. .. ఇందుకు సుశాంత్ ‘కానీ విషయం మీ గురించో లేక మా గురించో కాదు. సమస్య మొత్తం కేదార్‌నాథ్‌ది’ అని సుశాంత్ రాజ్ పుత్ చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ చేశారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సరా అలీఖాన్ లీడ్ రోల్స్ ప్లేచేస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఆర్ఎస్వీపీ అండ్ గై ఇన్ ద స్కై నిర్మాణం. సంగీతం అమిత్ త్రివేది. తుష్కర్ కాంతి రే ఫొటోగ్రఫీ. కేదార్ నాధ్ పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది.
వివాదం…
మరో ప్రక్క ఈ సినిమాను నిషేధించాలని బిజేపీ సీనియర్ నేత అజేంద్ర అజయ్ డిమాండ్ చేశారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ‘లవ్ జీహాద్’ను ప్రమోట్ చేస్తోందని ఆరోపణలతో ప్రకటన చేసారు. అంతేకాకుండా ఆయన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఛైర్మన్ ప్రశూన్ జోషికి లేఖ రాశారు. ‘కేదార్‌నాథ్ ప్రకృతి వైపరిత్యం నేపథ్యంలో సినిమాను తీయకుండా.. రొమాంటిక్‌గా తీశారు.
ఆ ఆలయం కోట్ల మంది హిందువుల నమ్మకానికి చిహ్నం. దర్శకుడు హిందువులను ఏ మాత్రం గౌరవించడం లేదు’ అని అన్నారు. సినిమా విడుదలను అడ్డుకుంటూ ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సినిమాను నిషేధించాలంటూ సీబీఎఫ్‌సీని కోరారు.