సీక్రెట్ ప్రేమికురాలు గుట్టు బ‌య‌ట‌ప‌డిందిగా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రిన కైఫ్ సింగిల్ స్టాట‌స్ గురించి తెలిసిందే. స‌ల్మాన్ తో బ్రేక‌ప్ అయ్యాక ర‌ణ‌బీర్ తో నిండా ప్రేమ‌లో మునిగిన క‌త్రిన అత‌డు ఇచ్చిన ట్విస్టుతో ఇక ల‌వ్ అన్న మాట‌కే దూర‌మైపోయింది. తిరిగి స‌ల్మాన్ గూటికి చేరి సైలెంటుగా సినిమాలు చేసుకుంటోంది. అయితే ఈలోగానే మ‌రో ల‌వ్ ఎఫైర్ తో హాట్ టాపిక్ గా మారింది.

క‌త్రిన ప్ర‌స్తుతం యువ‌హీరో విక్కీకౌశల్ తో డేటింగ్ లో ఉంద‌ని తెలుస్తోంది. మంగళవారం ముంబైలోని ఓ స్నేహితుడి ఇంట్లో విక్కీని క‌త్రిన‌ రహస్యంగా కలుసుకున్న ఉదంతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కత్రిన‌- విక్కీకౌశల్‌లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని కొంత‌కాలంగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. డేటింగ్ చేస్తున్నఈ బాలీవుడ్ ప్రేమపక్షులు గతంలో దీపావళి పండుగ సందర్భంగా ఓ పార్టీలో మెరిశారు. గతంలో ఓ రెస్టారెంట్‌లోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. అక్క‌డ‌ ఓ చెఫ్ తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. రాత్రివేళ అత్యంత రహస్యంగా ఈ జంట‌ వేర్వేరు కార్లలో ముంబైలోని ఓ స్నేహితుడి ఇంటికి వచ్చి కలిశారని సమాచారం. ఆ ఫోటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి.