బాలీవుడ్ ‘జిగేల్ రాణి’..చూస్తే కళ్లు తిప్పుకోలేం

గత కొద్ది రోజులుగా దేశం మొత్తం మాట్లాడుకుంటున్న సాంగ్ ఏమిటి అంటే..సురయ్యా సాంగ్. ఈ సాంగ్ ప్రోమో వచ్చిన దగ్గర నుంచి కత్రినాకైఫ్ అందాల గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పాటలో ఆమె వేసిన స్టెప్స్ ఒకెత్తు అయితే ఆ పాటలో ఆమె అందాల ప్రదర్శన మరో ఎత్తు. కత్రినా కైఫ్ ని ఈ స్దాయిలో ….తెలుగు వాళ్ల బాషలో చెప్పాలంటే జిగేల్ రాణి గా చూడలేదంటున్నారు. ఈ ఫొటోలు చూస్తే మీరూ అదే మాట అంటారు.

చాలా సరదాగా సాగే ఈ పాటలో కత్రినాకైఫ్ మెస్మరైజ్ చేసే స్టెప్పులతో అదరగొట్టింది. ప్రొమోలో కత్రినా శరీరాన్ని స్ప్రింగ్‌లా మెలికలు తిప్పుతూ చేసిన డ్యాన్స్‌కు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. అయితే ఈ స్టెప్పులు తనకైతే అంత సాధ్యమయే పనికాదన్నాడు అమీర్‌ఖాన్. తాజాగా ఇదే పాట తెలుగు వ‌ర్షెన్ కూడా విడుద‌ల చేశారు. ఇది కూడా ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటుంది.

బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించగా.. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్యచోప్రా ప్రొడ్యూస్ చేసారు. కత్రినా కైఫ్, దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ హీరోయిన్లుగా నటించారు.

Telugu(తెలుగు): Majjaare Khudhaa Song Teaser | Thugs Of Hindostan |Aamir, Katrina, Fatima| Ajay-Atul

చిత్రంలో ఫిరంగి పాత్ర‌లో అమీర్‌ఖాన్ , సురయ్యా పాత్ర‌లో కత్రినాకైఫ్ క‌నిపించ‌నున్నారు. ఫాతిమా సనా షేక్ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుండ‌గా, కల్నల్ ఫిలిప్ మెడోవ్స్ 1983లో రాసిన కన్ఫేషియన్స్ ఆఫ్ ఎ థగ్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యష్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్యచోప్రా అత్యంత భారీ స్థాయిలో చిత్రం రూపొందింది. 300 కోట్ల రూపాయలతో ఆదిత్య చోప్రా, ఆమిర్‌ఖాన్ ఈ సినిమాని నిర్మించారు . దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరాఠీ చిత్రం సైరట్‌కు సంగీతం అందించిన అజయ్-అతుల్ ఈ చిత్రానికి పనిచేసారు.

ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. హిందీతో పాటు దక్షిణాది భాషలైన తెలుగు, తమిళంలో విడుదల చేస్తున్నారు.