‘కబీర్ సింగ్‌’ నిషేధించాలని కోర్ట్ లో కేసు, కేంద్రానికి లేఖ

విజయ్‌ దేవరకొండ కెరీర్ లో ‘అర్జున్‌ రెడ్డి’ఓ సంచలనం . తెలుగులో సెన్సేషన్‌ సృష్టించిన ఈ చిత్రాన్ని.. మిగతా భాషల్లో కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్‌లో అర్జున్‌ రెడ్డి రీమేక్‌పై భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ మొన్న శుక్రవారం రిలీజైంది. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం కు డివైడ్ టాక్ వచ్చినా, అర్జున్ రెడ్డికు నకలు అన్నా కలెక్షన్స్ విషయంలో మాత్రం కుంభవృష్టి కురిపిస్తోంది. అయితే ఈ సినిమా ఇప్పుడో వివాదం లో ఇరుక్కుంది.

కబీర్ సింగ్‌ చిత్రం పై ముంబైకి చెందిన ఓ డాక్టర్ కేసు నమోదు చేశారు. షాహీద్ కపూర్, కియారా అద్వానీ ప్రతివాదులుగా చేర్చారు. వైద్య వృత్తిని కించపరిచే విధంగా సినిమాను తెరకెక్కించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చిత్రంలో షాహీద్ కపూర్ మద్యానికి బానిసైన సర్జన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా డ్రగ్ ఎడిక్ట్‌గా కూడా కనిపిస్తాడు.

దాంతో కబీర్ సింగ్ చిత్రం డాక్టర్ల మనోభావాలను కించపరిచే విధంగా ఉంద ని, అందుచేత సినిమాను నిషేధించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. డాక్లర్లంటే తప్పుడు అభిప్రాయం కలిగే విధంగా కబీర్ సింగ్ ఉంది అని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కేంద్ర వైద్యశాఖ మంత్రి, సమాచార శాఖా మంత్రికి లేఖ రాస్తామని మీడియాతో అన్నారు. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని సదరు వైద్యుడు కోరాడు. డాక్టర్ల ఇమేజ్‌ను తుంగలో తొక్కే విధంగా ఉంది. వైద్య వృత్తి పవిత్రమైంది. అలాంటి తెర మీద చెడు ప్రభావం చూపేలా ఉంది అంటూ ఫిర్యాదుదారు ఆవేదన వ్యక్తం చేశాడు.