ఏది వద్దంటారో అదే చూడాలనే ఆలోచన టీనేజర్స్ లో ఎక్కువ ఉంటోంది. అందుకోసం వాళ్లు ఏం చేయటానికైనా సిద్దపడతారు. ఇప్పుడు కబీర్ సింగ్ చిత్రం పెద్దలకు మాత్రమే, 18 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే చూడాలి అని రూల్ పెడితే దాన్ని అతిక్రమించటానికి సిద్దపపోతున్నారు టీనేజ్ కుర్రాళ్లు.
2019లో విడుదలైన బాలీవుడ్ చిత్రాల్లో హైయెస్ట్ గ్రాసర్ గా ‘కబీర్ సింగ్’ నిలుస్తోంది. ఈ సినిమా బాలీవుడ్ స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ నటించిన ‘భారత్’, అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి’, రణ్ వీర్ సింగ్ ‘గల్లీ బాయ్’ సినిమాల కలెక్షన్స్ ను కూడా క్రాస్ చేసి విక్కీ కౌశల్ నటించిన ‘యూరి’ రికార్డుని టార్గెట్ చేస్తోంది.
షాహిద్ కపూర్ హీరో గా తెరకెక్కిన ఈ మూవీకి ఎన్ని విమర్శలు ఎదురైనా హైయెస్ట్ కలెక్షన్స్ వసూల్ చేసి తన సత్తా చాటుతోంది. జూన్ 21న విడుదలైన ఈ సినిమా 11 రోజుల్లో దాదాపు 191 కోట్లు వసూల్ చేసి షాక్ ఇచ్చింది. ఈ నేపధ్యంలోఈ సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటూంటే జయపూర్ లో ఉన్న టీనేజర్స్ కు కూడా చూడాలనిపించింది. కానీ వాళ్లను థియోటర్స్ లోకి రానివ్వటం లేదు.
ఇది గుర్తించిన ఆ కుర్రాళ్లు దీనికి తెలివిగా ఒక స్కెచ్ వేసారు. స్మార్ట్ ఫోన్ లో యాప్ ని ఉపయోగించి ఆధార్ కార్డులోని డేట్ అఫ్ బర్త్ ని మార్చేసి దాన్నే ప్రింట్ రూపంలో తీసుకుని ఎంట్రీ దగ్గర చూపించి లోపలి వెళ్ళిపోతున్నారు. హిట్ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ కాబట్టి సెక్యూరిటీ సైతం పెటించుకోకుండా పంపిచేస్తున్నారు.