బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణంపై ముంబై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఆయన చివరిగా ఎవరెవరితో మాట్లాడారు? ఎంతసేపు సమయం గడిపారు? ఏ ఆసుపత్రిలో మానసిక ఒత్తిడికి చికిత్స తీసుకున్నారు? ఆయన గత ఎఫైర్స్. ఇలా అన్నింటిపై కూపీ లాగుతున్నారు. అయితే సుశాంత్ మృతికి కారణం మనస్థాపం అనేది ప్రాధమికంగా పోలీసులు తేల్చారు. తాజాగా క్లినికల్ డిప్రెషన్ లక్షణాలతో బాధపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సుశాంత్ ఆ వ్యాధికి సంబంధించిన వైద్యం పొందుతున్నారని తెలిపారు. దానికి సంబంధించి కౌన్సిలింగ్ కూడా తీసుకున్నారుట. కానీ ఎలాంటి ఔషదాలు తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు.
రాజ్ పుత్ సోదరి, ఇద్దరి మేనేజర్లు, వంటమనిషి, సుశాంత్ స్నేహితుడు, బుల్లి తెర నటుడు మహేష్ ని విచారించారు. సుషాంత్ చనిపోయే ముందు చివరిగా మహేష్ తోనే మాట్లాడే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో తేలింది. సుషాంత్ ఆత్మ హత్యకు ముందు మహష్ కి ఫోన్ చేసాడు. కానీ అతను ఆ సమయంలో గాఢ నిద్రలో ఉండటంతో ఫోన్ తీయలేదు. అయితే అప్పటికే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడి చనిపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ మహేష్ గనుక ఆ ఫోన్ కాలు లిప్ట్ చేసి ఉంటే సుశాంత్ ఆత్మహత్య నిర్ణయం మారి ఉండదేని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సూసైడ్ అనేది ఇంట్లో ఎవరూ లేనప్పుడు..ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మనసుకు తోచే ఆలోచనని..అలాంటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే గనుక వెంటనే ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చేస్తారని చెబుతున్నారు. సుశాంత్ చివరిగా అలాంటి ప్రయత్నమే చేసి ఉండొచ్చు. కానీ మహేష్ ఫోన్ లిప్ట్ చేయకపోయే సరికి జరగాల్సిన అనర్ధం జరిగిపోయి ఉంటుందని పోలీసులు, మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే బలవన్మరణానికి రెండు రోజుల క్రితం సుషాంత్ ఇంట్లో కుటుంబ సభ్యులందరితో ఫ్లోన్లో మాట్లాడారు. ఆ సమయంలో తన తండ్రిని బాగా చూసుకోవాలని సభ్యులతో అన్నారు. అంటే సుషాంత్ ఆత్మహత్య చేసుకోవాలని అప్పటికే నిర్ణయం తీసుకున్నాడా? అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.