ఇప్పుడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో సినిమా చేస్తున్న ఏకైక హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే అని చెప్పాలి. ప్లాప్ లు పడుతున్నా కూడా ఒకదాన్ని మించి ఒక భారీ సినిమాలు సెట్ చేస్తూ ఆశ్చర్య పరుస్తున్నాడు.
ఇలా అధికారికంగా అనౌన్స్ అయ్యినవి ఇంకా అవ్వాల్సినవి చాలా సినిమాలే తన ఖాతాలో ఉన్నాయి. అయితే ఇపుడు ఈ భారీ సినిమాల లైనప్ లో ఓ సినిమాపై బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి లేటెస్ట్ టాక్ బయటకొచ్చి వైరల్ అవుతుంది.
బాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ దర్శకుల్లో అదిరిపోయే యాక్షన్ సినిమాలు చేసే స్పెషలిస్ట్ దర్శకుల్లో “వార్”, “బ్యాంగ్ బ్యాంగ్” ఫేమ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కూడా ఒకడు. అయితే సిద్ధార్థ్ ఆనంద్ ప్రభాస్ తో ఓ భారీ సినిమాని తెలుగు మరియు హిందీలో ప్లాన్ చేసాడని టాక్ బయటకి వచ్చింది కానీ తర్వాత వినిపించలేదు.
కానీ ఇప్పుడు ఈ భారీ సినిమాపై లేటెస్ట్ టాక్ కన్ఫర్మ్ అవుతుంది. ఈ సినిమా ఆగిపోలేదని ఈ ఇద్దరి కాంబినేషన్ లో అనుకున్నట్టుగానే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తోనే తెరకెక్కుతుంది అని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ బిగ్ ప్రాజెక్ట్ పై ఎట్టకేలకు ఒక మంచి వచ్చింది అని చెప్పాలి.