ఇండస్ట్రీ టాక్ : “ఆదిపురుష్” కి తెలుగు రాష్ట్రాల్లో భారీ డీల్..డీటెయిల్స్ తెలుసుకోండి!

Ayodhya ram mandir episode will be added in prabhas adipurush

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న ప్రస్తుత చిత్రాల్లో షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని రిలీజ్ డేట్ సిద్ధం చేసుకున్న చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. ఒకవేళ ఈ ఏడాదిలో కానీ బాలీవుడ్ సినిమాలు అన్నీ రాణించకపోతే ఇక వచ్చే ఏడాది బాలీవుడ్ లో కొత్త ఊపు ప్రభాస్ ఈ సినిమా తోనే తీసుకొస్తాడని ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

మరి ఆ లెవెల్ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా ఈ సినిమాకి ఇప్పుడు మాసివ్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి లేటెస్ట్ గా అయితే తెలుగు రాష్ట్రాలకి సంబంధించి తెలుగు మరియు హిందీ బిజినెస్ ని రికార్డు స్థాయిలో 100 కోట్లకి డీల్ లాక్ చేసుకున్నారని తెలుస్తుంది.

మరి ఈ సినిమా హక్కులు కూడా సొంతం చేసుకుంది మరెవరో కూడా కాదట ప్రభాస్ ఫ్రెండ్స్ భారీ సినిమాల నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు అట. మొత్తానికి అయితే తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల షేర్ ని ఈ సినిమా రాబడితే సేఫ్ అవుతుందని చెప్పాలి.

ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు ఓంరౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కించగా జానకి దేవి పాత్రలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ఇంగ్లీష్ లో కూడా విడుదల కాబోతుంది.