గత వారం రోజులుగా బాలీవుడ్ మీడియా మొత్తం నానా పటేకర్ గురించే మాట్లాడుకుంటోంది. కొంతమంది గుసగుసలు ఆడితే మరికొంతరు మీడియా ముందు ఆయన గురించి ముచ్చట్లు చెప్తున్నారు. కొందరు కావాలంటే మీకు పర్శనల్ ఆయన గురించి మాట్లాడతాం కానీ మీడియాకు ఎక్కం అని చెప్పేస్తున్నారు. ఎందుకంటే సాటి నటుడు గురించి ఎవరు మాత్రం చెడు గా చెప్పగలరు. అందరికీ అదే సమస్య వస్తోంది.
అదే సమస్య బాలీవుడ్ సీనియర్ నటి డింపుల్ కపాడియా కు వచ్చినట్లుంది. అయితే మాత్రం …నాకు భయం ఏమిటి అన్నట్లు …నానా పటేకర్ ని మంచి నటుడే కానీ క్రూరత్వం ఉంది…ఓ చీకటి కోణం ఉంది అంటూ తన మనస్సులో మాటలు చెప్పేసింది. అయితే ఎనిమిది సంవత్సరాల క్రితం మాటలు ఇవి. అప్పట్లో ఈ ఇష్యూ గురించి మాట్లాడిన మాటల వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో వదిలారు. ఆ వీడియో వైరల్ గా మారింది.
Nana Patekar’s “dark side” has always been an open secret in Bollywood.
Dimple Kapadia said this 8 years ago. pic.twitter.com/9hbd0WmcZo
— Od (@odshek) September 28, 2018
ఈ వీడియోలో పటేకర్ గురించి డింపుల్ ..అనుపమ చోప్రాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నానా పటేకర్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నారా? లేక గతంలోలాగే ఉన్నారా? అని డింపుల్‌ను యాంకర్ ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నాకు తెలిసి అతడు క్రూరత్వం ఉంది. అతడు గొప్ప నటుడే. కానీ అతడి జీవితంలో ఓ చీకటి కోణం కూడా ఉంది’ కాకపోతే మనందరి జీవితాల్లోనూ చీకటి కోణం ఉంటుంది. దాన్ని మనం
మన వ్యక్తిత్వంతో కవర్ చేస్తామని చెప్పింది..
అసలు ఆమె చెప్పిన మాటలు కర్ర విరక్కుండా..పాము చావకుండా ఉన్నట్లు ఉన్నాయి.‘నటుడిగా నైపుణ్యం విషయానికి వస్తే అతడ్ని మించిన వారు లేరు. అంత అద్భుతమైన నటుడు. అతడి ప్రతిభను చూశాకా.. వంద హత్యలు చేసినా క్షమించాలి అనిపిస్తుంది. నా ప్రాణం కూడా తీసుకో అనాలి అనిపిస్తుంది. నటుడిగా అతడిపై నాకున్న అభిప్రాయం ఇది. వ్యక్తిగతంగా అతడు చాలా స్నేహంగా ఉంటారు. అదేవిధంగా అతడిలో చెడు కోణం కూడా ఉంది. ప్రతి ఒక్కరికీ అలాంటి చీకటి కోణం ఉంటుంది’ అని డింపుల్ పేర్కొన్నారు.