సెక్స్ కంటెంట్ పై బ్యాన్ పెడితే ఇంకా రెచ్చిపోతారంటోంది

అడల్ట్ కంటెంట్ కు అడ్డాగా మారిన బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ తన మాటలు కూడా అదే స్దాయిలో ఉండేలా చూసుకుంటుంది. అడల్ట్ సీన్స్ కు హైయిస్ట్ ప్రయారిటీ ఇచ్చే ఆమె సినిమాలు మినిమం గ్యారెంటీగా డబ్బులు తెచ్చిపెడుతూండటంతో ఆమె చాలా ధైర్యంగా అడల్ట్ కంటెంట్ ని సపోర్ట్ చేస్తూంటుంది. హాలీవుడ్ సినిమాల్లో కనపడే హాట్ సీన్స్ ని బాలీవుడ్ కు తెచ్చిన ఘనత ఆమెదే.

అయితే అడల్ట్ కంటెంట్ ని సైతం క్లాస్ గా ప్రెజెంట్ చేస్తూండటంతో ఆమెకు పోటీ లేకుండా పోతోంది. ఇక ఆమె గురించి ప్రక్కన పెడితే..గత కొద్ది కాలంగో వెబ్ ఛానెల్స్ లో పెరిగిపోతున్న సెక్స్ కంటెంట్ పై కోర్టు స్పందించింది. సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. మరీ ఎక్కువ హాట్ కంటెంట్ ఉంటే దాన్ని అప్ లోడ్ చేయటం కూడా నేరమే అని తేల్చి చెప్పింది. ఈ విషయమై ఏక్తా నోరు విప్పింది. ఎందుకంటే ఆమె కు సంభందించిన వెబ్ ఛానెల్స్ లోనే ఇలాంటివి ఎక్కువ జరుగుతూంటాయి.

దాంతో తన బిజినెస్ కు దెబ్బ తగులుతుందనుకుందో ఏమో కానీ ..అసలు ఇలాంటి కంటెంట్ ఆపాలని చూస్తే జనం ఇంకా రెచ్పిపోయి చూస్తారని వాదనకు దిగింది. సెక్స్ అనే పదంతో సమస్య ఏమీ లేదని, నేరాలు కు సెక్స్ ఉండే సంభందం అనుకున్నంతగా లేదని అంటోంది. అయినా నటించేవాళ్లకు, చూసే వాళ్లకు లేని సమస్య మీకేంటని అంటోంది. మన సొసైటిలో ఏదన్నా బ్యాన్ చేసి, చూడద్దు అంటే ఇంకా రెచ్చి పోయి అలాంటి కంటెంట్ కోసం వెతుకుతారంటోంది. మొత్తానికి ఏక్తా కపూర్ కు ఈ కోర్ట్ తీర్పు గట్టిగానే గుచ్చుకున్నట్లుంది కదా.