‘అవతార్’ లో హీరోగా అడిగారు,టైటిల్ నేనే ఇచ్చా

నమ్మలా ? ‘అవతార్’ లో హీరోగా అడిగారు,టైటిల్ నేనే ఇచ్చా

కొన్ని విషయాలు వింటూంటే అసలు నమ్మబుద్దికావు. కానీ అవతలి వాళ్ళు అసలు అది గమనించరు. చెప్పుకుంటూ పోతూంటారు. అయితే వాటి వల్ల ఎవరికీ నష్టం లేకపోయినా, నవ్వులు పాలవుతూంటారు. ఇప్పుడదే బాలీవుడ్ కామెడీ హీరో గోవింద విషయంలో జరుగుతోంది. ఆయన తాజాగా హాలీవుడ్ మెగా హిట్ అవతార్ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. జనాలు తెగ నవ్వేసుకుంటున్నారు. అవేంటో తెలుసుకోవాలని మీకూ ఉందా…

రాజిత్ శర్మ ఆప్ కు అదాలత్ పోగ్రాంలో గోవిందా మాట్లాడుతూ..నేను అవతార్ సినిమాకు టైటిల్ ఇచ్చాను. అది పెద్ద సూపర్ హిట్ అయ్యింది. మొదటే నేను ఈ సినిమా బాగా ఆడుతుందని చెప్పాను అన్నారు. అలాగే నేను జేమ్స్ కామరన్ కు చెప్పాను…ఈ సినిమా ఎంత లేదన్నా షూటింగ్ పూర్తవటానికి ఏడేళ్ళు పడుతుందని. అప్పుడాయన కోపం తెచ్చుకుని నువ్వు ఎలా చెప్పగలవు..అంతకాలం పడుతుందని అని అన్నారు. మీరు ఊహ తీయాలంటే ఆ మాత్రం షూటింగ్ డేస్ పడతాయని చెప్పాను. నేను అన్నట్లుగానే సినిమా ఎనిమిది సంవత్సరాలుకు పైగా పట్టింది. అయితే హిట్ అయ్యింది కాబట్టి సమస్యలేదు అన్నారు.

ఇక నాకు ఈ సినిమాలో మెయిన్ హీరో వేషం అడిగారు. అయితే నేను చేయలేను అని చెప్పా. ఎందుకంటే 410రోజులుషూటింగ్ అని చెప్పారు. అన్ని రోజులు పాటు శరీరం అంతా ఆ రంగు పూసుకుని ఉండటం నా వల్ల కాదని తేల్చి చెప్పాను. అయితే నేను చెయ్యకపోయినా సూపర్ హిట్ అవుతుందని అన్నాను అని చెప్పుకొచ్చారు.